Begin typing your search above and press return to search.
అటు జగన్...ఇటు పవన్...మధ్యలో బీజేపీ...?
By: Tupaki Desk | 21 Jun 2022 3:30 PM GMTఇదేమి రాజకీయం అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ప్రస్తుతం తెర వెనక ఇదే రకమైన రాజకీయం సాగుతోంది అని ప్రచారం సాగుతోంది. ఇంతకీ పవన్ బీజేపీ మిత్రులు కదా జగన్ ఎలా వచ్చారు అంటే ఆయన ఢిల్లీ స్థాయిలో బీజేపీ కేంద్ర పెద్దలతో దోస్తీ చేస్తున్నారు అన్న ప్రచారం ఉంది. దానిని బలపరచే విధంగా అనేక రకాలుగా బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు ఇచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి.
ఈ నేపధ్యంలో కేంద్ర పెద్దలకు జగన్ మీద గురి కుదిరింది. అంతే కాదు మూడవసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈసారి మిత్రుల అవసరం దండీగా పడనుంది అని కేంద్ర పెద్దలు ఊహిస్తున్నారు. అలాంటి సమయంలో నమ్మకమైన వారు తోడుగా ఉండాలి అన్నది బీజేపీ అగ్ర నేతల ఆలోచన. ఏపీలో చంద్రబాబు జగన్ల విషయం తీసుకుంటే బాబు కంటే జగన్నే బీజేపీ ఎక్కువగా నమ్ముతోంది అంటున్నారు.
దానికి కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ వల్ల దెబ్బ తిని జైలుకు వెళ్ళిన జగన్ కాంగ్రెస్ అంటే ఏ టైమ్ లో అయినా ఆమడదూరం జరుగుతారని కాషాయ దళానికి తెలుసు. ఇక కాంగ్రెస్ బీజేపీకి జాతీయ స్థాయిలో వైరి పక్షం అని కూడా ఇక్కడ చూడాల్సిన విషయం. అదే విధంగా చూస్తే చంద్రబాబుది అవకాశ వాద రాజకీయం అని కూడా బీజేపీ వారు భావిస్తున్నారుట.
ఈ రోజు అధికారంలో లేక బాబు ఎన్ని మాటలు చెప్పినా రేపటి రోజున ఆయన చేతికి డబుల్ డిజిట్ నంబర్ లో ఎంపీలు ఉంటే ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చి మరీ చక్రం తిప్పేస్తారు అన్న డౌట్లు కూడా ఉన్నాయట. అంతే కాదు 2018లో బాబు ఒకసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన దాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారుట.
అందువల్లో ఏపీలో వైసీపీకి ఎంపీ సీట్లు ఎక్కువగా వస్తే అవి తమ ఖాతాలో ఇండైరెక్ట్ గా అయినా పడతాయి అన్నది బీజేపీ వ్యూహకర్తల ఆలోచనగా ఉంది అంటున్నారు. ఇక ఏపీలో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో నెగ్గితే మాత్రం ఆయన రాజకీయ చాతుర్యం, చాణక్యంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఇక బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ కనుక రాకపోతే ఢిల్లీలో బాబు రూపంలో కూడా కొత్త ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారుట.
అందుకే టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు వద్దని వారు అనుకోవడమే కాదు పవన్ కళ్యాణ్ కి కూడా నచ్చచెబుతున్నారుట. ఏపీలో టీడీపీని దూరం పెట్టాల్సిందే అన్నది బీజేపీ అజెండాగా ఉంది అని చెబుతున్నారు. బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కావాలని పవన్ చాలా కాలంగా అడుగుతున్నారు. అయితే బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ లో జనసేన బీజేపీ బలోపేతం అవడమే ఉంటుదని, 2024లో దానికి పునాదులు వేసుకుని గట్టి పక్షంగా నిలబడితే 2029లో రాజకీయం పూర్తిగా తమ కూటమికే అనుకూలంగా ఉంటుందని కూడా చెబుతున్నారుట. ఇదే బీజేపీ రోడ్ మ్యాప్ లో ఉంటుందిట.
ఇక పవన్ కి ఈ సందర్భంగా కొన్ని హామీలు కూడా బీజేపీ కేంద్ర పెద్దల నుంచి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 2024లో బీజేపీ కేంద్రంలో మరోమారు అధికారంలోకి వస్తే పవన్ కి కేంద్ర స్థాయిలో కీలకమైన పదవి ఇస్తారని కూడా అంటున్నారు. అంటే పవన్ కి అధికార వైభోగం మీద హామీ ఇస్తూనే బాబు నుంచి వేరు చేయలన్నది బీజేపీ అగ్రనాయకుల వ్యూహం అని తెలుస్తోంది. అలాగే ఏపీలో జనసేన ఒక కీలక శక్తిగా ఎదిగేలా అన్ని విధాలుగా బీజేపీ అండగా నిలుస్తుందని కూడా చెబుతున్నారుట.
ఈ విధంగా ఒక వైపు జగన్ మరో వైపు పవన్ని దగ్గరపెట్టుకుని ఏపీ పాలిటిక్స్ నుంచి చంద్రబాబును టీడీపీని ఎలిమినేట్ చేయాలన్నదే కమలం పార్టీ పక్కా ప్లాన్ అని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పవన్ ఎంతరవకూ అంగీకరించి ముందుకు సాగుతారు అన్నదే ఇక్కడ చూడాల్సిన విషయం. పవన్ బీజేపీ రోడ్ మ్యాప్ కి కనుక ఓకే చెప్పకపోతే ఈ రెండు పార్టీల దారులు వేరు అవుతాయనే అంటున్నారు. మొత్తానికి బాబుకి ఏపీలో పొలిటికల్ గా అప్ లిఫ్ట్ ఇవ్వరాదు అన్న బీజేపీ డెసిషన్ లో ఏ రకమైన మార్పు లేదనే అంటున్నారు