Begin typing your search above and press return to search.
ఒకే ఒక మోడీ : గురు శిష్యులిద్దరికీ భంగపాటేనా..?
By: Tupaki Desk | 23 Jun 2022 2:30 AM GMTఆయన నరేంద్ర మోడీ. గుజరాత్ సీఎం గా 2001లో ప్రమాణం.చేశారు. దానికి ముందు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే లేరు. అయితే నాటి నుంచి నాటౌట్ అన్నట్లుగా ఆయన రాజకీయ ప్రభ ఒక్క లెక్కన వెలుగుతూనే ఉంది. ఇక 2001 కి బాగా వెనక్కి వెళ్తే అప్పటికే బీజేపీలో ఎల్కే అద్వానీ వరిష్ట నేతగా ఉన్నారు. ఆయన వాజ్ పేయి తరువాత బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అంతే కాదు, బీజేపీ పునాదులలో ఆయన ఒకరు.
ఇక వెంకయ్యనాయుడు విషయానికి వస్తే ఆయన రాజకీయం అప్పటికి రెండు దశాబ్దాల ముందు నుంచే ఉంది. ఆయన అనేక కీలక పార్టీ పదవులు చేపట్టి జాతీయ స్థాయిలో బీజేపీలో వాజ్ పేయ్, అద్వానీ వంటి వారితో పాటు కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరూ గురు శిష్యులుగా ఉండేవారు. అద్వానీకి వెంకయ్యనాయుడు మీద శిష్య వాత్సల్యం. అలాగే నాయుడుకు కూడా అద్వానీ మీద గురుభక్తి మెండు.
ఇక సీన్ కట్ చేస్తే 2014 వచ్చింది. అప్పటికి అద్వానీ ప్రభ తగ్గిపోయింది. బీజేపీకి కొత్త రక్తంగా నరేంద్ర మోడీ వచ్చారు. ఆయన నాటికే గుజరాత్ సీఎం గా సుదీర్ఘ కాలం నుంచి ఉంటూ తనకంటూ ఒక ఇమేజ్ ని సాధించుకున్నారు. దాంతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్ళూరారు. అపుడు ఆయనకు బీజేపీలో జాతీయ నేతలలో చూస్తే ఒక రాజ్ నాధ్ సింగ్, వెంకయ్యనాయుడు వంటి వారి నుంచే మద్దతు దక్కింది.
అలా మోడీ జాతీయ రాజకీయాల్లో ఒక కెరటంలా దూసుకువచ్చారు. ఇక అద్వానీ మోడీ జాతీయ నాయకత్వం మీద నాడు అభ్యంతరం చెప్పారన్న కారణం మీద మోడీ ప్రధాని అయ్యాక ఆయనని తగ్గించేశారు అని అంటారు. ఒకనాడు గుజరాత్ సీఎం గా ఉంటూ తాను గోద్రా అల్లర్ల విషయంలో ఇబ్బంది పడినపుడు గురువుగా అద్వానీ తనను ఆదుకుని ఆదరించి ఒక స్థాయిలో నిలబెట్టారు అన్నది గుర్తుందో లేదో కానీ మోడీ మాత్రం అలా అద్వానీని సైడ్ చేశారు అని చెబుతారు.
ఇక 2017 రాష్ట్రపతి ఎన్నికలలోనే అద్వానీని ఎన్నుకుంటారని అంతా అనుకుంటే మోడీ మాత్రం రామ్ నాధ్ కోవింద్ ని ఎంపిక చేసి గురువు గారికి హ్యాండ్ ఇచ్చేశారు అని అంటారు. అలా అద్వానీ ఇపుడు రాజకీయాల నుంచి పూర్తిగా కనుమరుగు అయిపోయి వృద్ధాప్య జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఇపుడు శిష్యుడు వెంకయ్యనాయుడు విషయానికి వస్తే ఆయన అద్వానీ శిష్యుడు అయినా మోడీ నీడగానే మెలిగారు. జాతీయ రాజకీయాలలో తన కంటే జూనియర్ అయినా కూడా మోడీ అడుగులలోనే నడిచారు.
దాని ఫలితంగా కొన్నాళ్ళు కేంద్ర మంత్రిగా కీలకంగా వ్యవహరించినా వెంకయ్యనాయుడు చురుకుదనం, జాతీయ స్థాయిలో ఆయన అనుభవాలు పరిచయాలే ఆయన క్రియాశీల రాజకీయ జీవితానికి మైనస్ గా మారాయని అంటారు. దాని ఫలితంగా 2017లో ఉప రాష్ట్రపతి పదవిలోకి వెంకయ్యనాయుడు వెళ్ళాల్సి వచ్చింది. నాడు ఇబ్బందిగానే వెంకయ్యనాయుడు ఆ పదవి తీసుకున్నారు.
అయితే అయిదేళ్ల పాటు ఆయన చిత్తశుద్ధితో ఆ పదవిని నిర్వహించారు. మోడీ ప్రభుత్వాన్ని పెద్దల సభలో అనేక సార్లు రాజ్యసభ చైర్మన్ గా ఆదుకున్నారు. రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుకు చాన్స్ కచ్చితంగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు చూస్తే అది కూడా లేకుండా పోయింది. మొత్తానికి చూస్తే నాడు అద్వానీకి ఏదైతే జరిగిందో నేడు వెంకయ్యనాయుడుకూ అదే జరిగింది.
ఒక అద్వానీ ఒక వెంకయ్యనాయుడు బీజేపీకి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ముందుకు తెచ్చారు. కమిటెడ్ గా పార్టీ కొరకే అని పనిచేశారు. ఈ ఇద్దరూ ప్రధాని కావాల్సిన వారే. తప్పితే రాష్ట్రపతులు అయినా కావాల్సిన వారే. కానీ ఉప ప్రధానిగా అద్వానీ తన రాజకీయ జీవితాన్ని ముగిస్తే ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ముగించాల్సి వస్తోంది. ఈ ఇద్దరితోనూ ఎంతో అనుబంధం ఉన్నా మోడీ మార్క్ ఆలోచనలు, ఆయన వ్యూహాలు వల్లనే ఈ ఇద్దరూ కీలకమైన పదవులను అందుకోలేకపోయారా అంటే జవాబు ఎవరికి తోచినది వారు చెప్పుకోవచ్చు.