Begin typing your search above and press return to search.

బీజేపీ అసలు టార్గెట్ ఇదేనా ?

By:  Tupaki Desk   |   2 July 2022 6:33 AM GMT
బీజేపీ అసలు టార్గెట్ ఇదేనా ?
X
హైదరాబాద్ లో మూడురోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. మామూలుగా అయితే ఇలాంటి భారీ కార్యక్రమాలను పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిర్వహిస్తుంటారు. మొన్ననే జరిగిన మూడురోజుల కాంగ్రెస్ చింతన్ శిబిరం కూడా రాజస్ధాన్ లోని ఉదంపూర్ లో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. రాజస్ధాన్లోనే ఎందుకు జరిగిందంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టే.

ఈ నేపద్యంలోనే బీజేపీ కార్యవర్గ సమావేశాలు మరి హైదరాబాద్ లో ఎందుకు జరుగుతున్నట్లు ? ఎందుకంటే ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు భారీ ప్రణాళికలను వేస్తున్నారు కాబట్టి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది తామే అని నానా రచ్చ చేస్తున్నారు. కేసీయార్ లేదా టీఆర్ఎస్ నేతలపై మైండ్ గేమ్ అప్లైచేసి ఎంతమందిని వీలైతే అంతమందిని బీజేపీలోకి లాగేసుకోవాలనేది కమలంపార్టీ హిడెన్ అజెండా.

ఒకవైపు టీఆర్ఎస్ నేతలపై వల విసురుతున్న బీజేపీ ఇదే సమయంలో మరోవైపు కాంగ్రెస్ నేతలపైన కూడా గాలమేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు. ఇలాంటి వాళ్ళు బీజేపీకి ఇంకా చాలామంది అవసరం.

రెండుపార్టీల నుండి సుమారు 100 మందిని పార్టీలోకి లాగేసుకోవాలన్న టార్గెట్ పెట్టుకున్నారట కమలనాదులు. ఇంతమంది తమ పార్టీలో చేరాలంటే జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించటం ఒకటే మార్గం.

దీనివల్ల ఉపయోగం ఏమిటంటే నరేంద్రమోడి మూడు రోజులు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. మోడితో పాటు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతల్లో చాలామంది హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు.

అంటే పార్టీ బలమేంటో చూపించి, అధికారంలోకి రాబోయే పార్టీ తమదే అని చెప్పుకోవటమే కమలనాదుల ముఖ్యఉద్దేశ్యం. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగితే అధికారంలోకి వచ్చేస్తారా ? అంటే గ్యారెంటీలేదు. కాకపోతే ఒక పెద్ద షో చేయటమే వీళ్ళ ఉద్దేశ్యం. పార్టీలో చేరేందుకు అటు ఇటు ఊగిసలాడుతున్న నేతలను మోడిని చూపించి లాగేసుకునే అవకాశాలున్నాయి. అందుకనే ఇక్కడ ఇంత భారీ కార్యక్రమం పెట్టుకున్నారు.