Begin typing your search above and press return to search.

క‌ట్టు త‌ప్పేసిన కాంగ్రెస్‌.. కాపాడ‌డం ఎవ‌రిత‌రం?

By:  Tupaki Desk   |   19 July 2022 7:30 AM GMT
క‌ట్టు త‌ప్పేసిన కాంగ్రెస్‌.. కాపాడ‌డం ఎవ‌రిత‌రం?
X
జాతీయ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క‌ట్టు త‌ప్పేసింది. వినేందుకు.. అనేందుకు కూడా ఒకింత బాధ‌గా ఉన్నా.. ఇది నిజం. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు పార్టీ క‌కావిక‌లం అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనికి తాజాగా జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లే ఉదాహ‌ర‌ణ‌. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా.. య శ్వంత్ సిన్హాను తెర‌మీదికి తీసుకువ‌చ్చిన‌.. కాంగ్రెస్ నేతృత్వంలోని విప‌క్షాల కూట‌మి.. ఆయ‌న‌ను గెలి పించేందుకు ప్ర‌య‌త్నాలు చేసింది.

అయితే.. ఆయ‌న గెలుపు సాధ్యం కాదని.. ముందుగానే ఒక అంచ‌నా వ‌చ్చిన నేప‌థ్యంలో గెల‌వ‌క పోయి నా.. ప్ర‌ధాని మోడీకి స‌త్తా చూపేందుకు.. విప‌క్షాల ఉనికిని ఆయ‌న‌కు ప్ర‌త్య‌క్షంగా ప‌రిచ‌యం చేసేందు కు.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను ప్ర‌ధాన ఆయుధంగా మార్చుకోవాల‌ని.. కాంగ్రెస్ త‌ల‌పోసింది.

అందుకే.. దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల‌కు.. ప‌దే ప‌దే పిలుపునిచ్చింది. య‌శ్వంత్‌కు జాగ్ర‌త్త‌గా ఓటేయాల‌ని కోరింది. దీనికి అంద‌రూ త‌ల‌లూపారు. దీంతో కాంగ్రెస్‌కొండంత ఆశ‌లు పెట్టుకుంది.

య‌శ్వంత్ ఓడినా.. తాము గెలుస్తామ‌ని.. ద్రౌప‌దికి అతి త‌క్కువ మెజారిటీ రావ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని.. భా వించింది. ఇదే జ‌రిగితే.. మోడీని ఆడేసుకునేందుకు.. గొప్ప సాధ‌నం ల‌భించిన‌ట్టేన‌ని.. కాంగ్రెస్ నేత‌లు త‌ల‌పోశారు. కానీ, చివ‌రి నిముషంలో అంతా రివ‌ర్స్ అయిపోయింది. ఏకంగా.. తెలుగు రాష్ట్రాల్లోనే 'ఇద్ద‌రు' బీజేపీకి అనుకూలంగా ఓటేసిన‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం ఉంది. వీరిలో ఒక‌రు సీత‌క్క కాగా.. మ‌రొక‌రు.. నిత్యం బీజేపీ స్మ‌ర‌ణ చేసే ఓ ఎమ్మెల్యే అని అంటున్నారు.

మ‌రోవైపు.. దేశ‌వ్యాప్తంగా చూసుకున్నా.. అసోంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మూకుమ్మ‌డిగా.. బీజేపీకి గుద్దేశారు. గోవాలో.. 8 మంది బీజేపీకి అనుకూలంగా ఓటెత్తారు.

ఇక‌, ఒడిసాలో అయితే.. చెప్పి మ‌రీ.. బీజేపీకి ఓటేసిన‌.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. క‌ర్ణాట‌క‌లోనూక్రాస్ ఓటింగ్ జ‌రిగింది. ఇటీవ‌ల మ‌హారాష్ట్రంలో ఈడీ దాడులు ఎదుర్కొన్న‌వారు కూడా.. బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. ఇలా.. మొత్తంగా.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ క‌ట్టు త‌ప్పేసింది. అధిష్టానం మాట‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌వారు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని బ‌ట్టి.. కాంగ్రెస్ భ‌విత‌వ్యం ఏంట‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.