Begin typing your search above and press return to search.

గంటా ఆపరేషన్ స్టార్ట్...?

By:  Tupaki Desk   |   17 April 2022 2:30 AM GMT
గంటా ఆపరేషన్ స్టార్ట్...?
X
ఉత్తరాంధ్రా జిల్లాలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు గట్టి పట్టుంది. ఆయనకు అర్ధ బలం, అంగబలం ఉన్నాయి. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెడితే నాడు ఆ మూడు జిల్లాలను చూసుకున్నదీ కాసుకున్నదీ గంటా వారే. ఇక 2014లో ఆయన టీడీపీలోకి జంప్ అయి ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉన్నారు. నాడు కూడా ఆయన బలగాలు సైకిల్ ఎక్కేశాయి. ఇక 2019 ఎన్నికలకూ ఆయనకు ఒక వ్యూహం ఉంది. కానీ సహచరుడు అవంతి శ్రీనివాసరావు సడెన్ గా వైసీపీలోకి జంప్ చేయడంతో అది అలా ఆగిపోయింది.

కానీ 2024లో మాత్రం గంటా మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు అని చెబుతున్నారు. కొడితే గురి కరెక్ట్ గానే కొట్టాలి అన్నది ఆయన ఆలోచన, పట్టుదల. ఇపుడు వైసీపీలో ఒక్కసారిగా చెలరేగిన అసమ్మతులు, అలకలూ కోపాలు తాపాలూ గంటా మాస్టార్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి అని అంటున్నారు.

దాంతో ఆయన తనదైన పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారు అని చెబుతున్నారు. గంటా ఈ మధ్య సడెన్ గా టీడీపీ ఆఫీస్ కి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పాయింట్స్ ని టచ్ చేశారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఎందుకు జగన్ సమీక్షకు హాజరు కాలేదు అని ఒక లాజిక్ పాయింట్ తీశారు.

అంతే కాదు విశాఖను రాజధాని చేస్తామని అన్నారే. ఆ జిల్లాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదూ అని బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు. ఈ రెండూ పాయింట్స్ ని ఇపుడు ఆలోచిస్తే చాలానే విషయం ఉందని ప్రచారం సాగుతోంది. విశాఖకు మంత్రి పదవి ఇస్తే అవంతికే ఇవ్వాలి. మరి ఆయన్ని సైడ్ చేసి గుడివాడకు ఇచ్చేశారు అన్నదే గంటా పాయింట్ అంటున్నారు. అలా ఒకనాటి తన సహచరుడికి దన్నుగా గంటా మాట్లాడారు అని తెలుస్తోంది.

ఇక ఉత్తరాంధ్రాలో బిగ్ ఫిగర్ గా ఉన్న బొత్స విషయాన్ని టచ్ చేయడం ద్వారా ఆయన వైపు ఒక లుక్కు వేశారు అని తెలుస్తోంది. బయటకు ఈ రెండు విషయాలూ కనిపిస్తున్నా లోపల ఇంకా పెద్ద లిస్టే గంటా మాస్టార్ వద్ద ఉండే ఉంటుంది అంటున్నారు. అందుకే ఆయన ధీమాగా ఒక మాట మీడియాకు చెప్పేశారు. టీడీపీ వైపుగా పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని. అందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారని హింట్ ఇచ్చారు. మరి గంటా ఆపరేషన్ స్టార్ట్ చేస్తే సూపర్ హిట్టే.

ఆయన టీడీపీలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు అయితే ఈ ఆరు జిల్లాల వైపు చూసుకోనవసరం లేనట్లే. మొత్తానికి గంటా రాజకీయ చాణక్యాన్ని మళ్లీ చూపించబోతున్నారు. అదే కనుక జరిగితే ఫ్యాన్ పార్టీకి చిక్కులూ చికాకులూ తప్పవని అంటున్నారు.