Begin typing your search above and press return to search.

నో ముంద‌స్తు : జ‌గన్ హుషారుకు మోడీ బ్రేకులు ?

By:  Tupaki Desk   |   10 Jun 2022 1:30 PM GMT
నో ముంద‌స్తు : జ‌గన్ హుషారుకు మోడీ బ్రేకులు ?
X
ప్ర‌జ‌లు త‌మ‌కు అప్ప‌గించిన అధికారాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని, చిర స్థాయిలో నిలిచే ప‌నులు చేశాకే ఐదేళ్లూ పాలించాకే తాము మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు పోతాం అని అప్పుడెప్పుడో ప్ర‌భుత్వ పెద్ద, మాజీ జర్న‌లిస్టు సజ్జ‌ల‌ రామ‌కృష్ణారెడ్డి చెప్పారు. ఆ మాట‌కు కొనసాగింపుగానే ప్ర‌స్తుత ప‌రిణామాలు ఉన్నాయి అని తెలుస్తోంది.

ఢిల్లీ కేంద్రంగా ఉన్న వాతావ‌ర‌ణం దృష్ట్యా ఇప్ప‌టికిప్పుడు ముంద‌స్తుకు పోవ‌ద్ద‌ని జ‌గ‌న్‌-ను వారించార‌ని తెలుస్తోంది. ప్రాథ‌మిక స‌మాచారం అనుసారం రాస్తున్న ఈ క‌థనంలో ముంద‌స్తు భ‌యాలు రాష్ట్రంలో ఇక ఎవ్వ‌రికీ అక్క‌ర్లేద‌ని, ఢిల్లీ కేంద్రంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఓ నిర్ణ‌యం జరిగిందని అంటున్నాయి వైసీపీ శ్రేణులు. అందుకే నిన్న‌మొన్న‌టి వేళ రానున్న ఎనిమిది నెల‌ల కాలానికి సంబంధించి ఓ కార్యాచ‌ర‌ణ మా ముఖ్య‌మంత్రి ఇచ్చి ఉన్నార‌ని ఆయా శ్రేణులు చెబుతున్నాయి.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాన్ని మ‌రికొంత కాలం కొనసాగించ‌డం ఖాయం అని తేలిపోవ‌డంతో ముంద‌స్తు లేదు అని ఓ క్లారిఫికేష‌న్ అందుతోంది హ‌స్తిన పురి నుంచి! అంటే ఇక‌పై పూర్తిగా పాల‌న‌పైనే దృష్టి సారించ‌డం ఖాయం అని తెలుస్తోంది.

ఎన్నిక‌ల‌పై కాకుండా పాల‌న‌పై, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి నిలిపి, రానున్న కాలంలో ప్ర‌ణాళిక బ‌ద్ధంగా ప‌నిచేసి పార్టీ ఆదేశాల‌కు అనుగుణంగా ప‌నిచేసి మంచి పేరు తీసుకుని రావాల‌ని జ‌గ‌న్ నిర్దేశించి ఉన్నార‌ని కూడా స‌మాచారం.

ఈ మేర‌కు రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రికొన్ని నెలల పాటు ఇంకా చెప్పాలంటే ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల‌లో గ‌డప గ‌డ‌ప‌కూ నిర్వ‌హించాల్సిందే అని నిర్థార‌ణ అయింద‌ని పార్టీ వ‌ర్గాలు అందిస్తున్న ప్రాథ‌మిక వివ‌రం.

దీని ప్ర‌కారం ఎవ్వ‌రైనా స‌రే ! నిర్ణ‌యించిన షెడ్యూల్ అనుసారం నెల‌లో ఇర‌వై రోజుల పాటు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాక త‌రువాత నిర్వ‌హించే స‌మీక్ష‌కు, అటుపై నిర్వ‌హించే వ‌ర్క్ షాప్ న‌కు త‌ప్ప‌క హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని, ప్రొగ్ర‌స్ రిపోర్ట్ అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు అందించ‌డం అన్న‌ది పార్టీ బాధ్య‌త అని, ఇందుకు త‌మ వ‌ర్గాలు నిరంత‌రం ప‌నిచేస్తాయ‌ని సీఎం స్ప‌ష్టం చేశార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్న మాట.