Begin typing your search above and press return to search.
పోలవరం ప్రాజెక్ట్ : మేధావులు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారా...?
By: Tupaki Desk | 1 Jun 2022 10:31 AM GMTపోలవరం కాదు కానీ మేధావులు బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారుట. రాజకీయాలు మాత్రమే తెలిసిన వారు నిపుణుల మాటలను వినకపోవడం వల్లనే ఇలా జరిగిందా లేక అతి ఉత్సహాంతో చేశారా. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదు అని మరో మారు కఠిన నిజాన్ని చెప్పిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పెద్ద బాంబునే పేల్చారు.
అంతే కాదు పోలవరం విషయంలో అతి పెద్ద తప్పు జరిగిపోయిందని అది టీడీపీ హయాంలోనే జరిగిందని మూడేళ్ల తరువాత తాపీగా దీర్ఘాలు తీస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ చేసిన తప్పును ఎత్తి చూపడానికి తాను చంద్రబాబు, దేవినేని ఉమలతో చర్చలకు సిద్ధమని ఆయన అంటున్నారు. అయితే ఇంజనీర్లు, నిపుణుల సమక్షంలోనే ఈ చర్చ సాగాలని ఆయన కండిషన్ పెట్టారు.
పోలవరం విషయంలో ఈ రోజు దేశంలోని మేధావులు అంతా బుర్రలు బద్ధలు కొట్టుకునే పనిని టీడీపీ చేసింది అని అంబటి చెబుతున్నారు. మొదట కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్లే నష్టం జరిగిందని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో నాటి టీడీపీ సర్కార్ పెద్దలు చారిత్రక తప్పిదాలనే చేశారని ఆయన విమర్శించారు.
ఇపుడు పోలవరం పరిస్థితి ఎలా ఉందంటే తిరిగి డయా ఫ్రం వాల్‌ను కొత్తగా నిర్మించాలా? లేదంటే దెబ్బ తిన్నదానికే మరమ్మతులు చేయాలా అన్న దాని మీద దేశంలోని మేధావులకే అర్ధం కావడం లేదని అంబటి అంటున్నారు. మొత్తానికి పోలవరం విషయంలో అంబటి ఇప్పటికి పదే పదే చెప్పిన మాటలు ఏంటీ అంటే జనాలేమీ పెద్ద ఆశలేమీ పెట్టుకోవద్దని మాత్రమే.
అంతే కాదు మరో రెండేళ్ల పదవీకాలం ఉన్న తమ ప్రభుత్వ హయాంలో పోలవరం పూర్తి అయ్యే సూచనలు లేవని కూడా చెప్పకనే చెబుతున్నారులా ఉంది. ఇక పోలవరం విషయంలో అన్నీ నిజాలే చెబుతాను అంటున్న అంబటి తనకు తెలిసినవి బాగానే చెప్పారు. కానీ జనాలకు వస్తున్న డౌట్లు ఏంటి అంటే మూడేళ్ల పాటు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. మరి ఆనాడు ఆయన డయాఫ్రం వాల్ బీటలు వారిందని, అది చారిత్రక తప్పిదమని, ముందు కాఫర్ డ్యాం కట్టకుండా కట్టారని ఎందుకు చెప్పలేదు అన్నదే అతి పెద్ద ప్రశ్న.
ఇక దీనికి మించి మరో బిగ్ ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే రీసెంట్ గా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజున వైసీపీ వారు డయా ఫ్రం వాల్ బీటలు వారిదని అంటున్నారని, తాను 2017లోనే ఆ విషయాన్ని చెప్పి టీడీపీ సర్కార్ ని హెచ్చరించాను అని అంటున్నారు.
మరి నాడు వైసీపీ నేతల చెవిన ఈ మాటలు పడలేదా పడినా అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి డేట్లు మారుస్తూ డెడ్ లైన్లు పెడుతూ చివరాఖరుకు ఇపుడు తప్పు అంతా టీడీపీదే అని చెప్పడమేంటని అంటున్నారు. మొత్తానికి వారు వీరూ అంతా కలసి పోలవరాన్ని చిక్కుల్లో పడేశారు, ఇపుడు మేధావులు బుర్రలు కొట్టుకునే పరిస్థితి తెచ్చారు అన్నది మాత్రం స్పష్టంగానే అర్ధమవుతోంది.