Begin typing your search above and press return to search.

ఎన్నిక జ‌ర‌గ‌నివ్వండి ఏక‌గ్రీవాల గోల ఎందుకు ?

By:  Tupaki Desk   |   13 Jun 2022 7:30 AM GMT
ఎన్నిక జ‌ర‌గ‌నివ్వండి ఏక‌గ్రీవాల గోల ఎందుకు ?
X
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించి నోటిఫికేష‌న్ రావ‌డంతో ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల నాయ‌కులు, అధికార వ‌ర్గాల నాయ‌కులు హాయిగా ఎవ‌రి వ్యూహంలో వారు ఉన్నారు. ఇవ‌న్నీ బాగున్నాయి కానీ ఏక‌గ్రీవం కోసం ఎందుకని బీజేపీ ప‌ట్టుబ‌డుతోంది అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.

ఎందుకంటే విప‌క్షం త‌ర‌ఫున గొంతుక ఏ విధంగా ఉంది ? ఏ స్థాయిలో ఉంది..? బీజేపీపై వ్య‌తిరేక‌త అన్న‌ది ఏ మేర‌కు వారు వినిపించడం సాధ్యం అవుతుంది ? అన్న‌వి తేలాలంటే ఎన్నిక ఉండాల్సిందే అన్న‌ది ఓ వాద‌న. దీంతో బీజేపీ ఏకీభ‌వించినా విభేదించినా త‌ప్పేం లేదు కానీ ఎవ‌రి వాదనేంటో తేలాల్సిందే ! కానీ బీజేపీ మాత్రం తెలివిగా పావులు క‌దుపుతోంద‌ని తెలుస్తోంది. ఓ ద‌ళిత మ‌హిళ‌ను కానీ ఓ మైనార్టీ మ‌హిళ‌ను కానీ పోటీలోకి దించేందుకు బీజేపీ యోచిస్తోంది. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఇందుకు సంబంధించి రాజ‌కీయం న‌డుపుతున్నారు.

ఇవిగో పేర్లు :

కొత్త రాష్ట్రప‌తి అయ్యే అవ‌కాశాలున్న వారిలో

ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ - కేర‌ళ గ‌వ‌ర్న‌ర్
త‌మిళ సై - తెలంగాణ గ‌వ‌ర్న‌ర్
వెంక‌య్య నాయుడు - ఉప రాష్ట్ర‌ప‌తి
జ‌గ్దీశ్ ముఖి - అస్సోం గ‌వ‌ర్న‌ర్
ద్రౌప‌ది ముర్ము - ఝ‌ర్ఖండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్
అన‌సూయ యూకి - ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్

త‌దిత‌ర పేర్లు ఎన్డీఏ కూట‌మికి సంబంధించి విన‌ప‌డుతున్నాయి.

మరోవైపు ఎన్టీఏకు వ్య‌తిరేకంగా యూపీఏ కూడా కొంత రాజ‌కీయం న‌డిపి ప‌ట్టు సాధించేందుకు యోచిస్తోంది. కాంగ్రెస్ తో పాటు ఆప్ కూడా త‌న‌దైన రాజ‌కీయం నడిపేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఆ రెండు పార్టీలు క‌లిసి వెళ్లినా ఇప్ప‌టికిప్పుడు సాధించేది ఏమీ ఉండ‌క‌పోయినా బీజేపీ ని ఎంద‌రు వ్య‌తిరేకిస్తున్నారో అన్న‌ది తెలుసుకునేందుకు అయినా ఈ ఎన్నిక ఓ ప్రామాణికం కావొచ్చు అన్న భావ‌న వినిపిస్తోంది.

ఎన్సీపీ నేత ప‌వ‌ర్ తో ఆప్ నేత సంజయ్ సింగ్ నిన్న‌టి వేళ ముంబైలో భేటీ అయ్యారు. ఇరువురూ తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చించారు. మ‌రి! ఆయ‌న మాట ప్ర‌కారం ఆప్ నిర్ణ‌యం ఏంటి ? లేదా ప‌వార్-ను సీన్లోకి తెస్తారా? అన్న‌వి ఇప్పుడు వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు. ఎన్డీఏ మాత్రం గెలుపు త‌మదే క‌నుక ఏక‌ప‌క్షంగా వెళ్తే బాగుండ‌ద‌ని అన్ని పార్టీల‌నూ క‌లుపుకునే ప్ర‌య‌త్న‌మే చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీ కేంద్రంగా సంప్ర‌తింపులు మొద‌లుపెట్టింది.

మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు పేరును బ‌ల‌ప‌ర్చాల‌న్న ఓ డిమాండ్ వ‌స్తోంది.కానీ అది మాత్రం నెగ్గే ఛాన్స్ లేదు. స‌భా సంప్ర‌దాయం ప్ర‌కారం ఉప రాష్ట్ర‌ప‌తిని రాష్ట్ర‌ప‌తిని చేసే అవ‌కాశాలున్నా కూడా కేంద్రం ఆలోచ‌న ఆ విధంగా లేద‌ని తేలిపోయింది.