Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్న 'పిళ్లై'

By:  Tupaki Desk   |   11 Oct 2022 5:54 AM GMT
టీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్న పిళ్లై
X
ఢిల్లీలో వెలుగు చూసిన‌.. లిక్క‌ర్ కుంభ‌కోణంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ చాలా గుంభ‌నంగా ఉంది. అస‌లు త‌మ‌కు ఏ పాపం తెలియ‌ద‌ని.. త‌మ‌కు ఎలాంటి సంబంధ బాంధ‌వ్యాలు కూడాలేవ‌ని.. ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే త‌న‌పై లిక్క‌ర్ కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు చేసిన‌.. బీజేపీ నేత‌ల పై.. ఎమ్మెల్సీ, సీఎం కుమార్తె క‌విత‌.. ప‌రువు న‌ష్టం దావా వేయించి.. నోళ్లు మూయించారు. అయితే.. క‌థ ఇక్క‌డితో అయిపోలేదు. దీంతోనే ఈ స్కాం ముగిసిపోలేదు.

తీగ లాగితే.. డొంక క‌దులుతున్న‌ట్టుగా.. సీబీఐ అధికారులు చేస్తున్న ద‌ర్యాప్తులో కీల‌క వ్య‌క్తి.. వారికి దొరికా డు. అంతేకాదు.. అప్రూవ‌ర్‌గా మారి.. 'అస‌లు' నిజాలు చెప్పేస్తాన‌ని కూడా అన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇంకేముంది.. నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌నే బెంగో.. లేక ఇప్ప‌టి వ‌ర‌కు తాము చేసింది.. బొంకో.. అని టీఆర్ ఎస్ నేత‌లు.. గాబ‌రా ప‌డుతున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఏం జ‌రిగినా.. జ‌ర‌గొచ్చ‌ని.. కూడా అంటున్నారు.

అస‌లు ఏం జ‌రిగింది?

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో సీబీఐ, ఈడీ అధికారులు త‌మ దర్యాప్తును ముమ్మ‌రం చేశారు. రాబిన్ డిస్ట్రిబ్యూట‌న్ కంపెనీతో సంబంధాలు.. ఉన్న బోయిన ప‌ల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్టు చేసింది. ఈయ‌న‌కు టీఆర్ ఎస్ పెద్దలకు బంధుత్వం ఉంద‌నేది అంద‌రికీ తెలిసిందే. అదేస‌మ‌యంలో.. అభిషేక్ రావుతో క‌లిసి.. ఈ వ్య‌వ‌హారాలు చూస్తున్న రామ‌చంద్ర పిళ్లై అనే కీల‌క వ్య‌క్తిని కూడా.. సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌ను కూడా ప‌లు మార్లు ప్ర‌శ్నించారు.

అయితే.. ఇత‌రుల మాదిరిగా కాకుండా.. పిళ్లై ఒకింత నిజం ఒప్పేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని.. సీబీఐ అధికారులు కూడా నిర్దారిస్తున్నారు. అంతేకాదు.. పిళ్లై.. అప్రూవ‌ర్‌గా మారేందుకు కూడా ఒప్పుకున్న‌ట్టు చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. అస‌లు ఈ కుంభకోణంలో తెలంగాణ పాత్ర ఏంటి? సూత్ర ధారులు ఎవ‌రు? అనే విష‌యాలు స్ప‌ష్టంగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి.

ఇప్పటి వ‌ర‌కు త‌మ‌కు సంబంధం లేద‌ని చెబుతున్నా.. టీఆర్ ఎస్‌పై సీబీఐ దృష్టి పెట్టిదంటేనే.. ఏదో ఉంద‌ని అర్ధం. సో.. ఇప్పుడు పిళ్లై క‌నుక అప్రూవ‌ర్‌గా మారి.. నిజాలు వెల్ల‌డిస్తే.. అది పార్టీలోని కీల‌క నేత‌ల‌కు చుట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఎమ్మెల్సీ క‌విత‌కు సంబంధం ఉన్న‌ అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డిని కూడా ఈడీ వరుసగా వారం రోజుల పాటు ప్రశ్నించింది. ఈ స్కాంలో సీబీఐకి పక్కా ఆధారాలున్నాయని.. తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని.. టీఆర్ ఎస్‌లో ఇప్ప‌టికే క‌ల‌క‌లం రేగింది. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.