Begin typing your search above and press return to search.
జిల్లా కోర్టులో ఉన్న 'జ్ఞానవాపి మసీదు-శ్రింగార్ గౌరి' వివాదం ఏమిటి?
By: Tupaki Desk | 12 Sep 2022 4:16 AM GMTయావత్ దేశం ఆసక్తిగా కోర్టు వైపు చూస్తున్న ఉదంతాల్లో ఒకటి జ్ఞానవాపి మసీదు-శ్రింగార్ గౌరి ఇష్యూ. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వారణాసిలోని ఈ వివాదంపై బోలెడంత చర్చ జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వాద ప్రతివాదాలు ముగియటం.. ఈ రోజు (సోమవారం) ఈ కేసుపై తీర్పును వారణాజి జిల్లా కోర్టు కీలక ఆదేశాలు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో.. అసలీ వివాదం ఏమిటి? ఏమేం జరిగాయి? లాంటి వాటిపై పలువురిలో సందేహాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జ్ఞానవాపి మసీదు-శ్రింగార్ గౌరి ఇష్యూకు సంబంధించి ఇప్పటివరకున్న వాదనలు ఏమిటన్నది చూస్తే.. వివాదం ఇలా షురూ..
జ్ఞానవాపి మసీదు ఔటర్ వాల్ వద్ద ఉన్న హిందూ దేవతలకు రోజువారీ పూజలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వివాదం మరింత ముదరటానికి కారణం ఇదే
అయితే.. ఈ మసీదు ఔటర్ వాల్ వద్ద ఉన్న హిందూ దేవతలకు సంబంధించి మసీద్ కమిటీ వాదన ఏమంటే.. అది వక్ఫ్ ఆస్తి అని అంజుమన్ అంతెజామియా వాదిస్తోంది. అయితే.. ఈ వాదనలో నిజం లేదని.. అసలు నిజం ఏమంటే.. ఆలయాన్ని కూలగొట్టిన తర్వాతే మసీదు కట్టారు అన్నది హిందూ వర్గం తరఫున న్యాయవాది మదన్ మోహన్ వాదన.
ఇంత పెద్ద వివాదాన్ని జిల్లా కోర్టు విచారణ ఎలా జరిగింది?
చూస్తుండగానే జ్ఞానవాపి మసీదు-శ్రింగార్ గౌరి వివాదం వారణాసిని దాటేసి యావత్ దేశంలోనూ చర్చ మొదలైంది. ఎవరికి వారు వారి.. వారి వాదనలు వినిపించటం మొదలుపెట్టారు.దీనికి తోడు సోషల్ మీడియా కూడా ఉండటంతో ఈ వాదనలకు బహుళ ప్రచారం మొదలైంది. ఎవరికి వారు తమ శక్తి మేర వాదనలు వినిపించటంతో ఇష్యూ చూస్తుండగానే ముదిరిపోయింది. దేశ వ్యాప్తంగా అందరిలోనూ చర్చ మొదలైంది.
ఇలాంటి వేళ సుప్రీంకోర్టు వద్దకు ఇష్యూ వెళ్లింది. దీనిపై ప్రాథమిక సమాచారాన్ని అందుకున్న సుప్రీంకోర్టు.. ఈ కేసును విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో జిల్లా కోర్టు విచారణను మొదలుపెట్టింది.
విచారణలో అత్యంత కీలకంగా.. తాజా తీర్పుపై మరింత టెన్షన్ తెచ్చే ఉదంతం ఏమిటి?
ఈ వివాదం ఇలా ఉండగానే.. దిగువకోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో వీడియోగ్రఫీ సర్వేకు దిగువ కోర్టు ఓకే చేసింది. ఈ నేపథ్యంలో మే 16న సర్వే పని చేశారు. మే 19న సర్వే నివేదికను కోర్టుకు సమర్పించారు. అయితే.. కోర్టుకు నివేదిక సమర్పించటానికి ముందే.. వీడియో గ్రఫీ సర్వేలోని అంశాలు మీడియాకు లీక్ కావటం మరో ఇష్యూగా మారింది.
జ్ఞానవాపి మసీదు-శ్రింగార్ గౌరి కాంప్లెక్స్ లో చేసిన వీడియో సర్వేలో ఒక శివలింగం బయటపడినట్లుగా హిందూ వర్గాలు దిగువ కోర్టును చెప్పగా.. అది శివలింగం కాదంటూ ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. ఇది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి.. ఈ ఇష్యూపై జిల్లా కోర్టు ఏమని తీర్పుఇస్తుందన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. తీర్పువెలువడుతున్న ఈ రోజున వారణాసి మొత్తం భారీ ఎత్తున భద్రతను చేపట్టారు. వారణాసి మొత్తాన్ని రెండు సెక్టార్లుగా విభజించి పోలీసుల బలగాల్ని మొహరించటంతోపాటు.. సున్నితమైన ప్రాంతాల్లో ప్లాగ్ మార్చ్.. ఫుట్ మార్చ్ లను నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాపైనా ఒక కన్నేసి ఉంచారు. మరి.. జిల్లా కోర్టు తీర్పు ఏమని ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.