Begin typing your search above and press return to search.
ఇళ్ల ధరలు: 8 నగరాల్లో డౌన్.. హైదరాబాద్ లో అప్.. ఎందుకిలా?
By: Tupaki Desk | 8 Nov 2022 11:30 PM GMTకరోనా లాక్ డౌన్ తో తగ్గిన రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ప్రస్తుతం మాంద్యం మబ్బులు కమ్ముకుంటుండడంతో సాఫ్ట్ వేర్ రంగం సహా టెక్నాలజీ రంగాల్లో స్తబ్ధత నెకొంది. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ పై కూడా పడుతోంది. అయితే దేశమంతా డౌన్ ట్రెండ్ నడుస్తుంటే.. హైదరాబాద్ లో మాత్రం పెరగడం ఇక్కడ రియల్ ఎస్టేట్ వృద్ధికి బలాన్ని ఇస్తోంది.
దీర్ఘకాలానికి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడి మరేదేంట్లోనూ రాదని 'ట్రాక్2 రియాలిటీ' నిర్వహించిన తాజా సర్వేలో 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. అందుకే హైదరాబాదీలు సొంత ఇల్లు ఉన్నా కూడా మరో ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. బడ్జెట్ ను బట్టి విల్లాలు, ఓపెన్ ఫ్లాట్లు, ఫామ్ ల్యాండ్ల వరకూ స్థిరాస్థులు కొంటున్నారు. అద్దెలు వస్తాయని కొందరు.. దాంతోపాటు విలువ కూడా పెరుగుతుందని వీటిలో పెట్టుబడి పెడుతున్నారు.
హైదరాబాద్ లో అయితే సిటీలో ఇతర ప్రాంతాల్లో నివాసమున్న వారు సైతం పిల్లల కోసం ఐటీ కారిడార్ లో స్థిరాస్థులు కొనుగోలు చేస్తున్నాయి. ఇళ్లు ఇక్కడ ఒకింత ఖరీదే అయినా ఆస్తి విలువ సైతం అదే స్థాయిలో పెరుగుతుందని కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు.
మార్కెట్లో అత్యంత సురక్షిత పెట్టుబడి ఏంటంటే అది 'రియల్ ఎస్టేట్'లో పెట్టుబడులే.. కళ్లముందు ఆస్తి ఉంటుందనే భరోసా ఎక్కువమందికి కలిగి ఇందులో పెడుతున్నారు. హైదరాబాద్ లాంటి చోట మార్కెట్లో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఇప్పటివరకూ ఉండదు. స్వల్పకాలంలోనూ ఒడిదొడుకులు తక్కువే ఉంటాయి. కొనుగోలుదారుల అభిప్రాయమూ ఇదే. ఆర్థిక మందగమనం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు తక్కువ అని 82 వాతం మంది ఈ రియల్ ఎస్టేట్ వైపే మొగ్గుతున్నారు.
దేశంలోని 9 నగరాల్లో అమ్ముడవ్వాల్సిన ఇళ్లు/ఫ్లాట్ల సంఖ్య సెప్టెంబరు త్రైమాసికంలో 12శాతం తగ్గిపోయింది. 4,77,570కి పరిమితం అయ్యాయని అనాలటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2021 సెప్టెంబరు ఆఖరుకు ఈ సంఖ్య 5,40,849గా ఉంది. విక్రయమవ్వాల్సిన ఇళ్ల సంఖ్య ఢిల్లీలో 32 శాతం ఉంటే, బెంగళూరులో 25శాతం బాగా తగ్గింది. హైదరాబాద్ లో మాత్రం ఏకంగా 19 శాతం పెరగడం విశేషం.
ఈ 9 నగరాల్లో కలిపి 1,08,817 ఇళ్లు/ప్లాట్లు అమ్ముడయ్యాయని.. ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ సంఖ్య 87747 మాత్రమేనని వివరించింది. నాణ్యమైన నివాసాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని.. ఇందువల్ల అమ్మకాలతోపాటు కొత్త ప్రాజెక్టులు కూడా అధికంగానే ప్రారంభమైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.