Begin typing your search above and press return to search.
భారత్ ఓడిందా..? బంగ్లా గెలిచిందా..? పడిపోతున్న ప్రమాణాలకు సాక్ష్యమా?
By: Tupaki Desk | 5 Dec 2022 7:33 AM GMTజీవం ఉందా లేదా అనిపించేలా పిచ్.. స్పిన్ కు సహకరిస్తుందా..? పేస్ కు అనుకూలిస్తున్నదా..? అర్థం కాని పిచ్.. భారత్ ఓడిందా..? బంగ్లాదేశ్ గెలిచిందా? ఏదీ తెలియని ఫలితం.. మొత్తానికి టీమిండియాకు తొలి వన్డేలో షాక్ తగిలింది. టచ్ లో వచ్చినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అయోమయం.. లయ అందుకున్నట్లు కనిపించిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి పరుగులు చేయకపోవడం.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ రివర్స్ స్వీప్ ఆడబోయి తుస్సుమనడం.. చివర్లో బ్యాటింగ్ వైఫల్యంతో జట్టు మూల్యం చెల్లించుకుంది. కానీ, బౌలర్లు పట్టుబిగించడంతో బంగ్లాదేశ్ ఓటమి బాటపట్టింది. అయితే, ఆఖర్లో అనూహ్యంగా నిలిచిన బంగ్లాదేవ్ స్పిన్ ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ తమ జట్టుకు ఊహంచని విజయాన్ని అందించాడు. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది టీమిండియా ప్రమాణాలు పడిపోతున్నాయా? అనే ప్రశ్న గురించే.
ఏదీ ఆ దూకుడు..
బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో పిచ్ పేలవంగా ఉన్నట్లే కనిపించింది. భారత టాప్ ఆర్డర్ తీరూ అందుకు తగ్గట్లే ఉంది. భారీ షాట్లకు అలవాటుపడ్డారేమో..? కనీసం ఒకటీ, రెండు పరుగులు చేయడానికి కూడా వీరు ప్రయత్నించినట్లు కనిపించలేదు. ధావన్, రోహిత్, కోహ్లి వంటి బ్యాట్స్ మెన్ కు గేమ్ ప్లాన్ విషయంలో చెప్పేదేముంటుంది..? పిచ్ స్వభావాన్ని తెలుసుకుని తగినట్లుగా ఆడుకుంటూ పోవాల్సిన వారు పూర్తిగా నిరాశపరిచారు. కోహ్లి.. అద్భుతమైన క్యాచ్ కు వెనుదిరిగినా అతడు ఉన్నంతసేపూ సౌకర్యంగా ఏమీ లేడు. రాహుల్ తప్ప ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆరో ఓవర్లో ధావన్ (7)ను ఔట్ చేసిన మెహదీ హసన్ భారత పతనాన్ని ఆరంభించాడు.
అప్పటికి స్కోరు 23 మాత్రమే. షకిబ్ 11వ ఓవర్లో రోహిత్ (27), కోహ్లి (9)లను వెనక్కి పంపాడు. 49కే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును రాహుల్ ఆదుకున్నాడు. శ్రేయస్ (24)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. వాషింగ్టన్ సుందర్ (19)తో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 33వ ఓవర్లో సుందర్ ఔటయ్యేటప్పటికి 152/5తో భారత్ కాస్త మెరుగ్గానే ఉంది. కానీ దిగువ వరుస బ్యాట్స్‌మెన్ క్యూ కట్టడంతో చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది. మొత్తం మీద భారత్ 34 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. 186 పరుగులకు పరిమితమైంది. రాహుల్ (73; 70 బంతుల్లో 5×4, 4×6) టాప్ స్కోరర్.
బ్యాటింగ్ చెత్త.. ఫీల్డింగ్ పేలవం.. కట్టుతప్పిన బౌలింగ్
బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో టీమిండియా ప్రదర్శన గురించి చెప్పుకోవాల్సి వస్తే పై మూడు వాక్యాలు చాలు. చివరి ఓవర్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్‌ను వదిలేశాడు. అంతకుముందు సుందర్ బంతిని పట్టేందుకు అసలు ముందుకే రాలేదు. వెలుతురు కారణంగా బంతిని చూడలేకపోవడంతో చేజార్చాడు. ఫీల్డర్ల వైఫల్యం కెప్టెన్ రోహిత్ శర్మకూ ఆగ్రహం తెప్పించిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గెలిచే మ్యాచ్ ను చేజార్చి..
''చక్కగా ఆడుతూ గెలిచే మ్యాచ్ ను చేజార్చుకోవడం'' అనేది రెండు దశాబ్దాల కిందటి వరకు టీమిండియాకు ఉన్న దుర్లక్షణం. కానీ, సెహ్వాగ్, యువరాజ్, ధోనీ తదితరులు వచ్చాక ఈ సంప్రదాయం మారింది. అయితే, మళ్లీ నిన్నటి మ్యాచ్ లో ఆ పరిస్థితి కనిపించింది. గెలుపు లాంఛనమే అనుకున్న స్థితిలో నిలిచినా.. చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. 187 పరుగుల ఛేదనలో బంగ్లాను 136/9కి పరిమితం చేసిన భారత్.. మరొక్క వికెట్‌ను పడగొట్టలేకపోయింది. గెలుపు వాకిట్లో బోల్తా కొట్టింది. మెహదీ హసన్ మిరాజ్ (38 నాటౌట్; 39 బంతుల్లో 4×4, 2×6), ముస్తాఫిజుర్ (10 నాటౌట్; 11 బంతుల్లో 2×4) అద్భుతంగా పోరాడి ఆఖరి వికెట్‌కు 51 పరుగులు జోడించి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. దీంతో బంగ్లా 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఇది మేల్కొనాల్సిన సమయం
వన్డే ప్రపంచ కప్ ఏడాది కూడా లేదు. 2023 అక్టోబరు-నవంబరులో జరుగనుంది. అది కూడా జరిగేది స్వదేశంలో. టీమిండియా కప్ గెలిచి 12 ఏళ్లవుతుంది. ఈసారి కూడా కప్ సాధించకుంటే.. అదీ సొంతగడ్డపై కూడా విఫలమైతే అంతే సంగతి. మరోవైపు టీమిండియా పరిస్థితి చూస్తే నానాటికీ తీసికట్టు అనేలా మారుతోంది. ఇటీవలి ఆసియా కప్, టి20 ప్రపంచ కప్ లలో ఓటములు.. తాజాగా బంగ్లాదేశ్ తో తొలి వన్డే ఓటమి, ప్రధాన పేసర్లు బుమ్రా, షమీ, ఆల్ రౌండర్ జడేజాకు గాయాలు, కెప్టెన్ రోహిత్ ఫామ్ ఏదీ సానుకూలంగా లేదు. దీన్నిబట్టి చెప్పేదేమంటే.. టీమిండియాకు ఇది మేల్కొలుపు సమయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.