Begin typing your search above and press return to search.

30 నిమిషాల్లో ప‌వ‌న్‌ను మోడీ కోల్డ్ స్టోరేజీలోకి పంపించాడా?

By:  Tupaki Desk   |   12 Nov 2022 9:30 AM GMT
30 నిమిషాల్లో ప‌వ‌న్‌ను మోడీ కోల్డ్ స్టోరేజీలోకి పంపించాడా?
X
తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ బేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఇరువురు నాయ‌కుల మ‌ధ్య భేటీ జ‌రిగింది. అయితే , ఇది బీజేపీతో చెలిమిప్రారంభించిన త‌ర్వాత జ‌న‌సేనానికి ల‌భించిన అరుదైన అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. 2020లోస్వ‌యంగా ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ నేత‌ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులు క‌లిపారు. క‌లిసి ప‌నిచేద్దామ‌ని సంక‌ల్పం చెప్పారు. ఈ క్ర‌మంలో దాదాపు రెండేళ్లు పూర్త‌య్యాయి.

అయితే... బీజేపీ మ‌రోవైపు వైసీపీతో తెర‌చాటు స్నేహం చేస్తూనే ఉంది. అలాగ‌ని ప‌వ‌న్‌ను వ‌దులుకోవ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే రోడ్ మ్యాప్ చెప్పండి.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూసుకుంటాను అని ప‌వ‌న్ పెద్ద ఆఫ‌ర్ ప్ర‌క‌టించినా బీజేపీ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు పెద‌వి విప్ప‌లేదు. ఇదిలావుంటే, ప్ర‌భుత్వంపై బీజేపీ నేత‌లు చేస్తున్న ఉద్య‌మం(అనాల్సిందే)లో జ‌న‌సేన‌ను భాగస్వామ్యం చేసుకోవ‌డం లేదు.

ఇక‌, జ‌న‌సేన చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు బీజేపీ కూడా దూరంగా ఉంటోంది. ఈ ప‌రిణామాల‌తో అస‌లు బీజేపీతో క‌లిసి ఉండాలా? వ‌ద్దా? అనే చ‌ర్చ జ‌న‌సేన‌లో ఎక్కువ‌గా సాగుతోంది. ఇదిలావుంటే, ఇప్పుడు తాజాగా మోడీని ప‌వ‌న్ క‌ల‌వ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే, మోడీకి ఆయ‌న వైసీపీపై ఫిర్యాదులు మోస్తారని, ఇటీవ‌ల విశాఖ‌, ఇప్ప‌టంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను వివ‌రించి వైసీపీకి అడ్డుక‌ట్ట వేస్తార‌ని జన‌సేన నాయ‌కులు క్లూ ఇస్తూ వ‌చ్చారు.

కానీ, అదేమీ జ‌రిగిన‌ట్టు సమాచారం లేదు. అటు ,ఇటు కాకుండా జ‌న‌సేన‌ను ఒక త్రిశంకు స్వ‌ర్గంలో ఉంచేలా మోడీ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంద‌ని జ‌న‌సేన నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌వైపు.. వైసీపీతో బీజేపీ పెద్ద‌లు స్నేహం చేస్తున్నారు. వారికి రాజ్య‌స‌భ‌లోనో కేంద్రంలోనో వైసీపీతోఎప్పుడు అవ‌స‌రం ఉంటే అప్పుడు వాడుకునేలా వైసీపీని దువ్వుతున్నారు. మ‌రోవైపు వైసీపీ కూడా బీజేపీ కౌగిలిని వ‌ద‌ల‌డం లేదు. వ్య‌క్తిగ‌త కార‌ణాలు కావొచ్చు.. మ‌రొక‌టి కావొచ్చు.

అలాగ‌ని.. జ‌న‌సేన అధినేత త‌మ నుంచి వీడిపోవ‌డాన్ని బీజేపీ కోరుకోవ‌డం లేదు. అంతేకాదు, అస‌లు బీజేపీతో క‌లిసిపోవాల‌నే 'ష‌ర‌తు' ఏదో తెర‌మీద‌కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదు. ఈ నేప‌థ్యంలోప వ‌న్‌ను త‌మ‌లో క‌లిపేసుకుని బీజేపీ జెండాను ఎగ‌రేయాల‌ని ఏదో వ్యూహం ఉన్న‌ట్టుగా జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు.

మ‌రోవైపు.. బీజేపీ పుంజుకునే ప‌రిస్థితి ఉందా అది లేదు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌తో బీజేపీ ఆడుకుంటోంద‌ని, ఇప్పుడు మోడీ కూడా ప‌వ‌న్‌ను ఎటూ కాకుండా చేసే వ్యూహం అమ‌లు చేస్తున్నార‌నేది జ‌న‌సేన నాయ‌కుల అభిప్రాయంగా ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.