Begin typing your search above and press return to search.
మునుగోడు నామినేషన్ పర్వంలో ఇదో 'చిత్రం' బ్రో!
By: Tupaki Desk | 15 Oct 2022 8:54 AM GMTమునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం ముగిసింది. అయితే.. ఈ నామినేషన్ల ఘట్టంలోనే అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. చివరి రోజు శుక్రవారం అత్యధికంగా 74 నామినేషన్లు దాఖలుకాగా, మొత్తం నామినేషన్ల సంఖ్య 130కి చేరింది.
చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు టీజేఎస్ అభ్యర్థిగా వినయ్, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏపాల్ నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రం 3గంటల్లోపు వచ్చిన వారికి అధికారులు టోకెన్లు జారీచేశారు. అందరి నామినేషన్లు పరిశీలించి బయటికి పంపేసరికి రాత్రి 10.30గంటల సమ యం పట్టింది.
నామినేషన్ల తిరస్కరణ ముగిశాక 64 మంది వరకు బరిలో ఉంటారని అధికారులు అంచనాకు వచ్చారు. ఇక నామినేషన్ దాఖలు చేసిన వారిలో స్వతంత్ర అభ్యర్థులే అధికంగా ఉన్నారు. కళాకారులు, చర్లగూ డెం రిజర్వాయర్ భూనిర్వాసితులు, లారీ యజమానులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. చర్లగూడెం రిజర్వాయర్ నిర్వాసితులను నామినేషన్ వేయడం.. ఆసక్తిగా మారింది.
ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ బరిలో ఉంటారని సర్వత్రా చర్చ సాగినా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో చివరికి తానే బరిలో దిగుతున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ.పాల్ రంగంలోకి ప్రకటించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది.
గుర్రంపై వచ్చి..
కల్కిభగవాన్ అనే స్వతంత్ర అభ్యర్థి గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశాడు. చుండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి గుర్రంపై వచ్చి నామినేషన్ వేశాడు. ఈయన మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం.. కుమ్మరిగూడెం ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరభోగ వసంతరాయులుగా ఉరఫ్ కల్కిభగవాన్‌గా చెబుతున్నారు.
ఈయనకు ఎల్బీ నగర్‌లో ఆసుపత్రి కూడా ఉందని తెలిసింది. ఏదేమైనా..ఇలా గుర్రంపై వచ్చి నామినేషన్ వేసిన సమయంలో కొందరు దీనిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో ఉంచడం.. ఆసక్తిగా మారింది. మరోవైపు.. ఒకే ఇంటి పేరుతో ఉన్న వారు నలుగురు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో 'కోమటిరెడ్డి' 'కూసుకుంట్ల' ఇంటి పేరు ఉన్నవారు కూడా ఉండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.