Begin typing your search above and press return to search.
శశికళ ఆరోగ్యం ఎలా ఉందంటే?
By: Tupaki Desk | 24 Jan 2021 12:30 PM GMTఅన్నాడీఎంకే మాజీ నేత, తమిళనాడు మాజీ సీఎం స్నేహితురాలు శశికళ ఆరోగ్యంపై తాజాగా వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిన శశికళ కు వైరస్ లక్షణాలు తగ్గాయని బెంగళూరులోని ఆమెకు చికిత్స చేస్తున్న విక్టోరియా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆమె ఆహారం తీసుకుంటున్నారని.. సపోర్ట్ సాయం నడుస్తున్నారని ఈ వర్గాలు ఆదివారం తెలిపాయి.
కరోనా పాజిటివ్ రావడం.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో శశికళ ఆరోగ్యం దెబ్బతిని సీరియస్ అయ్యింది. మొన్నటివరకు కూడా ఆందోళనకరంగా కనిపించింది. మరో రెండు వారాలు ఆమె చికిత్స పొందాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఆమె ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడినట్టు తాజాగా వైద్యులు తెలిపారు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నది మాత్రం వెల్లడించలేదు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నాలుగేళ్లుగా శశికళ బెంగళూరులోని అగ్రహారం జైల్లో ఉంటున్నారు. ఈనెల 27న ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం కోలుకున్నారు. త్వరలోనే జరిగే తమిళనాడు ఎన్నికల్లో శశికళ కీలకంగా మారనున్నారు. అన్నాడీఎంకే మాత్రం ఈమెను తీసుకోం అని ఇప్పటికే ప్రకటించింది.