Begin typing your search above and press return to search.

వివేక హత్య వెనుక పెద్ద తలకాయలు.. సంచలన ప్రకటన చేసిందెవరంటే?

By:  Tupaki Desk   |   10 Aug 2021 3:41 AM GMT
వివేక హత్య వెనుక పెద్ద తలకాయలు.. సంచలన ప్రకటన చేసిందెవరంటే?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి.. దివంగత మహానేత వైఎస్ సోదరుడు అయినా వివేకానందరెడ్డిని ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హతమార్చటం తెలిసిందే. ఈ కేసులో సునీల్ కుమార్ యాదవ్ ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో సునీల్ సోదరుడు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. అతడితో పాటు.. సునీల్ కుటుంబ సభ్యులు ఉన్నారు.

వివేక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు వీలుగా కొన్ని పెద్ద తలకాయలు సునీల్ ను ఇరికిస్తున్నారన్నారు. ఆ పెద్దవాళ్లు.. సీబీఐ అధికారుల నుంచి తమ కుటుంబానికి హాని ఉందన్నారు. వివేకాను హత్య చేసిందెవరో సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసన్న సునీల్ సోదరుడు.. ‘ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు’ అని చెప్పారు. సీబీఐ అధికారులు లేనిపోనివి వెతికిస్తున్నారని.. అందులో భాగంగానే కాలువలో మరణాయుధాలు ఉన్నాయని వెతికిస్తున్నారన్నారు.

సునీల్ ను నిందితుడిగా చూపే ప్రయత్నాన్ని పూర్తిస్థాయిలో తప్పు పట్టారు. ఇంతకు ముందు మాట్లాడని వాచ్ మన్ రంగన్న.. హత్య జరిగి రెండేళ్లు గడిచాకఇప్పుడెందుకు సునీల్ పేరును చెప్పారనటాన్ని ప్రశ్నించారు. దర్యాప్తులో తన కుటుంబానికి అన్యాయం జరుగుతుందని.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రిని కలిసి చెప్పాలనుకుంటే సీబీఐ అధికారులు అడ్డుకుంటున్నారన్నారు.

వివేకా.. సునీల్ మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయా? అంటూ విలేకరులు ప్రశ్నించగా.. అలాంటివేం లేవన్న వారు.. వివేకా తమ ఇంటికి రెండు..మూడుసార్లు ఇచ్చారన్నారు. మరి ఇదే విషయాన్ని వివేకా కుమార్తె సునీతను కలిసి ఎందుకు కలిసి చెప్పలేదని విలేకరులు అడగ్గా.. అలా చేస్తే కొందరు లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నట్లు చెప్పారు. సునీల్ ను రెండు నెలల 25 రోజుల పాటు ఢిల్లీలో ఉంచి దారుణంగా కొడుతున్నారని.. హత్యలో తన ప్రమేయం ఉందని ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు సీబీఐ అధికారుల టీం పులివెందుల గెస్టు హౌస్ లో పదమూడు మందిని విచారించింది. వారిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు.. యూసీఐఎల్ ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి.. ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డి.. పులివెందుల పురుపాలక ఛైర్మన్ వరప్రసాద్.. సీఎం జగన్ మామ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది వైసీపీ నేత జగదీశ్వర్ రెడ్డి.. స్థానిక సీఎస్ఐ చర్చి సభ్యులు.. స్థానిక వైద్య సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉంటే.. వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల వెలికితీత కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.