Begin typing your search above and press return to search.

అప్డేట్: కొనసాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు..తొలి విజయం వైసీపీదే

By:  Tupaki Desk   |   14 March 2021 3:50 AM GMT
అప్డేట్: కొనసాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు..తొలి విజయం వైసీపీదే
X
ఏపీలో పురపాలక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 6 గంటల్లోగా ఫలితాలు పూర్తికానున్నాయి. ఏపీలో పెద్ద మున్సిపాలిటీ అయిన విశాఖపట్నం కార్పొరేషన్ ఫలితాలు ఆలస్యం కానున్నాయి.విశాఖ లో డివిజన్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఆలస్యం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇక హైకోర్టు ఆదేశాలతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు.

11 నగరపాలక సంస్థల్లో 533 డివిజన్ సభ్యుల స్థానాలకు పోలైన 27,29,072 ఓట్లను లెక్కిస్తున్నారు. 71 పురపాలక, నగర పంచాయతీల్లో 1633 వార్డు సభ్యుల స్థానాలకు పోలైన 21,03,284 ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఏపీలో తొలి ఫలితం వెలువడింది. నాలుగు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలుస్తున్నారు. ఒక్క విశాఖలో మాత్రం టీడీపీ ముందజంలో గెలవడం విశేషం. విశాఖను రాజధానిగా మార్చిన జగన్ నిర్ణయానికి భిన్నంగా విశాఖ ఓటర్లు స్పందస్తున్నారని తెలుస్తోంది.

ఇక విజయవాడ, గుంటూరు, విశాఖ ఓటర్ల తీర్పు కీలకంగా మారింది. దీని మీదే అమరావతినా? లేక మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజా మద్దతు ఉందో లేదో ఫలితాలతో తెలియనుంది.

కౌంటింగ్‌ ప్రక్రియను మొత్తం వీడియో, ఫొటోలు తీయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల రికార్డుగా దీన్ని భద్రపరచనున్నారు. విద్యుత్ సమస్య ఏర్పడకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాపటు చేయాలని ఎస్ఇసి ఆదేశాలు ఇచ్చింది. రాత్రి 8 గంటల లోపు కౌంటింగ్ పూర్తి చేసేట్లుగా చూడాలని ఎస్ఇసి అధికారులకు సూచించింది.

ప్రకాశం జిల్లా కనిగిరి ఆరో వార్డులో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. ఏపీలో వెలువడ్డ తొలి ఫలితం ఇదే..