Begin typing your search above and press return to search.

ఉండవల్లి మీటింగ్‌ తో ఒరిగిందేంటి.?

By:  Tupaki Desk   |   31 Jan 2019 6:17 AM GMT
ఉండవల్లి మీటింగ్‌ తో ఒరిగిందేంటి.?
X
రెండు రోజుల క్రితం విజయవాడలోని హోటల్‌ ఐలాపురంలో మాజీ ఎంపీ ఉండవల్లి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీకి టీడీపీ నుంచి మంత్రులు నక్కా ఆనంద్‌ బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అలాగే ప్లాన్నింగ్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు కుటుంబరావు హాజరయ్యారు. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌, కాంగ్రెస్‌ నుంచి తులసిరెడ్డి, బీజేపీ నుంచి ఐవైఆర్‌ కృష్ణారావు, సీపీఐ నుంచి రామకృష్ణ హాజరయ్యారు. టీడీపీలో భేటీలో కూర్చునే ఉద్దేశం తనకు లేదని వైసీపీ సమావేశానికి రాలేదు. అలాగే.. బీజేపీతో ఉన్న వైరుధ్యాల దృష్ట్యా తాము కూడా సమావేశానికి హాజరుకాలేదమని సీపీఎం ప్రకటించింది.

అసలు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది ఏపీకి కేంద్రం ఎలా అన్యాయం చేసింది అనే అంశంపై చర్చిండానికి. అయితే.. అక్కడికి వచ్చిన వాళ్లలో టీడీపీ, బీజేపీ మినహా మిగిలన వాళ్లంతా ప్రేక్షక పాత్ర వహించారనే చెప్పాలి. టీడీపీకి, బీజేపీకి లెక్కల విషయంలో పెద్ద వాగ్వాదమే జరిగింది. టీడీపీ నుంచి హాజరైన మంత్రులు ఏపీకి కేంద్రం నుంచి ఇంకా రూ.1.16 లక్షల కోట్ల రావాలని లెక్క తేల్చారు. ఈ సమయంలో ఐవైఆర్‌ జోక్యం చేసుకున్నారు. ఏపీకి కేంద్రం చాలా ఇచ్చిందని.. అవన్నీ చెప్పకుండా ఇంకా రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోందని అన్నారు. కేంద్రాన్ని విలన్‌ గా చూపించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఈ సమయంలో.. కుటుంబరావుకి, ఐవైఆర్‌ కృష్ణారావుకు కాసేపు వాగ్వాదం జరిగింది.

ఉండవల్లి అఖిలపక్ష భేటీ ఏర్పాటుకు కారణం.. అందరూ కలిసి సంయుక్తంగా ఏపీకి రావాల్సిన వాటిపై పోరాడాలని. కానీ భేటీలో జరిగింది వేరు. ఎవరికి వారు వచ్చామా వెళ్లామా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అసలు సమావేశానికే రాలేదు. టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది ప్రస్తుతం. ఇలాంటి టైమ్‌ లో అందరూ కలిసి ప్రత్యేక హోదా కోసం లేదా మనకు రావాల్సిన నిధుల కోసం పోరాడతారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.