Begin typing your search above and press return to search.
మానసపుత్రిక రెండవ కంట కన్నీరు....?
By: Tupaki Desk | 23 Jun 2022 2:30 AM GMTరెండు ఉంటేనే చూపు. ఒక కన్ను ఉన్నా చూడవచ్చేమో కానీ అది సంపూర్ణం కాదు. మరి జగన్ అపర సృష్టి, ఆయన మానస పుత్రిక అయిన సచివాలయ వ్యవస్థకు రెండు కళ్ళు ఎవరూ అంటే ఒకటి అఫీసులో కూర్చుని పనిచేసే ఉద్యోగులు అయితే రెండవ వారు వాలంటీర్లు. నిజానికి వాలంటీర్లనే కళ్ళూ ముక్కూ చెవులు అని కూడా చెప్పాలి. వీరి డేటావే ప్రభుత్వానికైనా సచివాలయంలో కూర్చుని పనిచేసే ఉద్యోగులకు అయినా ఆధారం.
తెల్లారిలేస్తే ఇళ్ళిల్లూ తిరిగి వాలంటీర్లు అటు సచివాలయానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు. వారికి ఎన్నో వత్తిళ్ళు ఉంటాయి. జనాలతో పేచీ పూచీలు ఉంటాయి. స్కీములు ఎందుకు అమలు చేయలేదంటూ జనాల నుంచి ప్రశంసల వర్షమే కురుస్తుంది. ఇక వారంతా వైసీపీ వారే అని విపక్షాలు చేసే రాద్ధాంతాలను కూడా నేరుగా భరించాలి.
అటువంటి విపత్కర పరిస్థితులలో వారు పనిచేస్తున్నారు. ఎండనక వానక పనిచేస్తున్న వారికి గత మూడేళ్ళుగా జీతం కేవలం అయిదు వేల రూపాయలే. కరోనా రాక ముందు రూపాయికి ఉన్న విలువ ఈ మూడేళ్ళలో దారుణంగా తగ్గిపోయింది. దాంతో ఆ జీతంతో సగం అవసరాలు కూడా తీరడం లేదు అని వాపోతున్నారు.
ఇక ఆ మధ్య తమకు కూడా జీతాలు పెంచి పర్మనెంట్ చేయాలని వాలంటీర్లు గోల చేస్తే వారికి సత్కారాలు అవార్డులు అని సర్దిచెప్పి సైలెంట్ చేశారు. కానీ వారు ఇపుడు మరో మారు రగులుతున్నారు. అవార్డులు సత్కారాలు పొట్ట నింపవు కదా అని నిలదీస్తున్నారు. తమకు దారీ తెనూ చూపాలని కోరుతున్నారు.
తాము కూడా మూడేళ్ళుగా పనిచేస్తున్నామని వారు చెబుతున్నారు. సచివాలయం ఉద్యోగులకు ప్రోబేషన్ డిక్లేర్ చేసిన జగన్ సర్కర్ వాలంటీర్లను మాత్రం పక్కన పెట్టేసింది. ఇపుడు వారు మాకు కూడా మంచి జీతం జీవితం కావాలని కోరుతున్నారు. జగన్ ఎపుడూ రెండు కళ్ళు అని ఉద్యోగులను వాలంటీర్ల గురించి చెబుతారని, ఇపుడు ఒక కన్ను పొడిచేస్తారా అని నిలదీస్తున్నారు.
తమకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండే చేస్తున్నారు. ఈ విషయంలో ముందు విన్నపాలు చేస్తామని ఆనక తాము ఆందోళనలకు కూడా సిద్ధపడతామని చెబుతున్నారు. ఏపీలో రెండు లక్షల అరవై వేల మంది సచివాలయ వాలంటీర్లు ఉన్నారు. మరి వీరికి కూడా డిపార్ట్మెంటల్ టెస్టులు పెట్టి యోగ్యత ఉన్న వారిని తీసుకుని పాస్ కాని వారిని పదివేల గౌరవ వేతనంతో మంచిగా చూడాలని కోరుతున్నారు.
ఇంతకీ మానసపుత్రిక అంటే ఒక కన్నేనా అని వైసీపీ పెద్దలను వీరు అడుగుతున్నారు. అది కూడా ఎన్నికలు ముంచుకువస్తున్న వేళ వీరు కనుక రోడ్ల మీదకు వస్తే వైసీపీ పెట్టుకున్న ఆశలు అన్నీ కూడా కరిగిపోక తప్పదని కూడా అంటున్నారు.