Begin typing your search above and press return to search.
షర్మిలకు డబుల్ ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు ఏమో.?
By: Tupaki Desk | 7 Dec 2022 5:45 AM GMTతెలంగాణలో తాను బలపడాలంటే బలంగా ఉన్న టీఆర్ఎస్ ను ఢీకొట్టాలి. ఆ పార్టీని టార్గెట్ చేయాలి. ఆ దిశగానే షర్మిల ఆలోచనలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే అధికార టీఆర్ఎస్ టార్గెట్ గా ఆమె రాజకీయాలు నడుస్తున్నాయి. ఫక్తు టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి లబ్ధి పొందాలని షర్మిల చూస్తోంది. వారిని తిడుతూ మీడియాలో పాపులర్ అవ్వాలని ఆరాటపడుతోంది. తాజాగా మరోసారి కేసీఆర్ ఫ్యామిలీపై కవిత నోరుపారేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే మర్చిపోయినట్టు నాటకాలు ఆడారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. శ్రీకాంతా చారి అగ్గిపెట్టే తెచ్చుకొని అమరుడైతే.. హరీష్ రావు అగ్గిపెట్టే మర్చిపోయి మంత్రి అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోందన్నారు. కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడుతోందని.. వారందరికీ ఆస్కార్ అవార్డులు ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ గుండాల నుంచి నాకు ప్రాణహాని ఉందని.. నా బస్సును వాళ్లే తగులబెట్టి నన్ను సారీ చెప్పమంటారా.. మీది తాలిబన్ల భాష, తాలిబన్ల రాష్ట్ర సమితి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ యాత్ర సజావుగానే సాగుతోందని.. నా యాత్రను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని.. వారిది తాలిబన్ల భాష.. వాళ్ల పార్టీ తాలిబన్ రాష్ట్ర సమితి అని షర్మిల అన్నారు.
రాజకీయాల్లో అధికారం కోసం.. ఎదగడం కోసం నేతలు ఎంతకైనా తెగిస్తారు.. దానికి ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ షర్మిల అనడంలో ఎలాంటి సందేహం లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలే వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టాయని చెప్పొచ్చు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆ 16 నెలల పాటు పాదయాత్ర చేసి ఏపీలో వైసీపీని బతికించింది వైఎస్ షర్మిల. అనంతరం గత 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బైబై బాబూ’, ‘బైబై పప్పు’ అంటూ చంద్రబాబు, లోకేష్ పై ప్రచారంలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. జగన్ కంటే కూడా వైఎస్ షర్మిల ఏపీలో ప్రచారంలో తనదైన ముద్రవేశారు. ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేసేలా వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత ముద్ర వేసి.. అన్ని తిట్లు తిని ఇప్పుడు ఈ ఆడకూతురు షర్మిల తనకు ఏపీతో సంబంధం లేదంటోంది. అన్న జగన్ తో తెగదెంపులు అంటోంది. పులివెందులలో గత ఎన్నికల్లో ఓటు వేసిన ఈమెకు అసలు తెలంగాణతో ఏం సంబంధం అని ప్రశ్నిస్తే నోట మాట రాదు. తెలంగాణ వద్దు అని సమైఖ్యాంధ్ర నినాదంతో పాదయాత్ర చేపట్టిన వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణ కోసం పాటుపడుతుండడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తెలంగాణ కోడలిని అని చెప్పుకుంటున్న వైఎస్ షర్మిల ఇంకా తన ఏపీకి చెందిన తండ్రి ఇంటిపేరును ఎందుకు పెట్టుకుందని పలువురు నిలదీస్తున్నారు. తెలంగాణ భర్త ఇంటిపేరును మార్చుకోవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ఇంటిపేరును వాడుకుంటోందా? అని అడుగుతున్నారు. తెలంగాణ ఇంటి కోడలు అయితే వెంటనే ఇంటి పేరును మార్చుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.
ఇక తెలంగాణ ఉద్యమంలోనూ షర్మిల పాత్ర జీరో. ఆమె నాడు ఏపీ సమైక్యాంద్ర కోసం పోరాడింది. అలాంటి ఆమె ఇప్పుడు ఏపీలో అన్న జగన్ తో పడక.. ఆయన పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టింది. తనకు సంబంధం లేని వేష, భాష, ప్రాంతంలోకి అడుగుపెట్టి అరువుతెచ్చుకున్న భాషతో తెగ హడావుడి చేస్తోంది. తెలంగాణను ఆదినుంచి వ్యతిరేకించి సంబంధం లేని ఇలాంటి షర్మిలకు తెలంగాణలో ఎవరూ ఆదరించరని.. షర్మిలకు ఆదరణ దక్కకపోవడానికి కారణం అదేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. sa