Begin typing your search above and press return to search.

50 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త త‌మ్ముళ్లు.. నిజ‌మేనా..?

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:54 AM GMT
50 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త త‌మ్ముళ్లు.. నిజ‌మేనా..?
X
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. రెడీగా ఉన్నామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతు న్నారు. ఎప్పుడు పోలింగ్ వ‌చ్చినా.. టీడీపీ గెలుపును ఆప‌లేర‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌నే జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తూ.. స్వ‌యంగా ఆయా జిల్లాల్లో ఉన్న ప‌రిస్థితుల‌ను తెలుసుకుంటున్నా రు. ఫ‌లితంగా పార్టీ ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీలో ఉన్న లోటుపాట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

అయితే.. ఇలాంటిలోపాల‌ను సైలెంట్‌గా అధ్య‌య‌నం చేస్తున్న చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు తాను తిరిగిన ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు, క‌ర్నూలు, తిరుప‌తి జిల్లాల‌కు సంబంధించి 15 స్థానాల్లో కొత్త త‌మ్ముళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 50 వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పుల త‌థ్య‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను వైసీపీ ఎంత ప్రతిష్టాత్మ‌కంగా తీసుకుందో. టీడీపీ అంత‌కు మించిన ప్ర‌తిష్ట‌గా భావిస్తోంది.

దీంతో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోని పరిస్థితిని మార్చాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ప‌నిచేయ‌ని వారు. . చేస్తున్న‌ట్టు న‌టిస్తున్న‌వారు.. చేస్తున్న‌వారు.. అనే మూడు వ‌ర్గాలుగా త‌మ్ముళ్ల‌ను విభ‌జించారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడున్న నాయ‌కుల‌ను మార్చి తీరుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌లు సామ‌దాన భేద దండోపాయాల‌కు ఏమాత్రం వెర‌వ‌వ‌నే సంగ‌తి తెలిసిందే.

సో.. దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు ఖ‌చ్చితంగా మార్పుల‌కు నాంది ప‌లుకుతున్నార‌ని అంటు న్నారు సీనియ‌ర్ నాయ‌కులు. ఈ క్ర‌మంలోనే 50 మంది కొత్త‌ముఖాల‌కు అవ‌కాశం ఇస్తార‌ని.. వీరంతా పారిశ్ర‌మ‌లు.. వాణిజ్య‌, వ్యాపార వేత్త‌ల కుటుంబాల‌కుచెందిన వార‌ని సీనియ‌ర్ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చంద్ర‌బాబు వ్యూహం ఎలా ఉందో.. ఇదే జ‌రిగితే.. అక్క‌డున్న వారిని ఏం చేస్తారో చూడాలి.