Begin typing your search above and press return to search.
రాష్ట్రమంతా పోటీ చేస్తామంటున్న సినీనటుడు
By: Tupaki Desk | 14 Nov 2017 1:26 PM GMTప్రస్తుత సమయంలో రాజకీయ పార్టీని స్థాపించాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే...ప్రజాదరణ, ఓట్లు పొందడం అనే విషయంలో అనూహ్యమైన తేడా ఉండటం వల్ల. కానీ కన్నడ నటుడు ఉపేంద్రకు ఈ విషయంలో ధైర్యం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ``'గెలుపు ఓటములకు నేను భయపడను. నేను నాయకుడిని కాదు...జన సేవకుడిని...జన కార్మికుడిని`` అంటూ ప్రకటించిన కన్నడ స్టార్ ఇప్పుడు అన్నట్లుగానే తన పొలిటికల్ జర్నీ విషయంలో మరో స్పష్టత ఇచ్చారు. ఒకప్పుడు అన్నం లేక ఆకలితో ఉన్న తాను..సినీ నటుడిగా మారి ఎన్నో సినిమాలు చేసి, అనేక దేశాలు తిరిగి, సొంత రిసార్ట్ సంపాదించుకునే స్థాయికి చేరినప్పటికీ...తన లగ్జరీ జీవితం తనకు సంతృప్తి ఇవ్వకపోవడం వల్లే....పార్టీ ప్రజాక్షేత్రంలోకి వచ్చినట్లు ఉపేంద్ర తెలిపారు.
ప్రజా సేవ చేయడానికి, ప్రజల్లో మార్పు రావడానికే తాను పార్టీని ప్రారంభించినట్లు ఉపేంద్ర ప్రకటించారు. 2018లో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ఉపేంద్ర ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తాననే నమ్మకం తనకు ఉందని...గెలిస్తే సంతోషమని పేర్కొంటూ ఒకవేళ ఓడిపోయినా...ప్రాణం పోయే వరకు ప్రయత్నిస్తూనే ఉంటానని..ప్రజల్లో తిరుగుతూనే ఉంటానని ఉపేంద్ర ప్రకటించారు. రాబోయే నెలలో ఉపేంద్ర పార్టీ తరఫున బరిలో ఉండే నేతలపై స్పష్టత వస్తుందని సమాచారం.
కాగా, పార్టీ ప్రకటన చేసిన సమయంలో ఖాకీ రంగు చొక్కా ధరించి వచ్చిన ఉపేంద్రను ఉద్దేశించి ఆయన అభిమానులు రియల్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. తాను జన నాయకుడిని, జన సేవకుడిని కాదని.. జన కార్మికుడిననే అర్థం వచ్చేలా ఖాకీ చొక్కా వేసుకున్నానని ఉపేంద్ర తెలిపారు. తాను పూర్తిస్థాయి పారదర్శక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తున్నానని పేర్కొన్నారు. 'ఇతర పార్టీలు చేసినట్లు గొప్పగా నా రాజకీయ పార్టీని స్థాపించను. సామాజిక మాధ్యమాలు, టెలివిజన్ ఛానెల్స్, న్యూస్ పబ్లికేషన్స్ ద్వారానే నా పార్టీని ప్రచారం చేస్తాను` అని ఉపేంద్ర తెలిపారు. 'గెలుపు ఓటములకు నేను భయపడను. 'పనిచెయ్యి.. కానీ ప్రతిఫలాన్ని ఆశించకు' అనేది నమ్ముతానని ఆయన స్పష్టం చేశారు. తాజాగా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు.