Begin typing your search above and press return to search.
మోడీకి షాక్..గుడ్ బై చెప్పిన కేంద్రమంత్రి
By: Tupaki Desk | 10 Dec 2018 9:09 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఊహించని షాక్ తగిలింది. ఓ వైపు ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల టెన్షన్ కొనసాగుతుండగా, మరోవైపు కీలక రాష్ర్టానికి చెందిన నేత, కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ్ .. ప్రధాని మోడీ టీమ్ నుంచి తప్పుకున్నారు. మానవ వనరుల శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న ఆయన.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ఇవాళ వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. తమ పార్టీతో సీట్ల పంపకం సరిగా జరగలేదని ఆయన ఆరోపించారు.
బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర కుష్వాహ్ మోడీ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారు. అయిదేళ్ల క్రితం ఎన్డీఏలో కలిశామని, ఎన్నో ఆశలతో చేరామని, బీహార్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ వాటిని అమలు చేయలేకపోయారని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ పార్టీకి బీహార్ ఎంపీ సీట్లలో కేవలం రెండు సీట్లు మాత్రమే కేటాయించేందుకు మోడీ నిర్ణయించారు. దీంతో కేంద్రమంత్రి ఉపేంద్ర ఎన్డీఏకు గుడ్‌బై చెప్పారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిశారు. బీజేపీతో కలిసి పనిచేసది లేదన్న విషయాన్ని ఉపేంద్ర ఇవాళ వెల్లడించనున్నారు.
కాగా, పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందే రోజు సాక్షాత్తు కేంద్రమంత్రివర్గంలో ఉన్న నాయకుడు గుడ్ బై చెప్పేయడం సంచలనంగా మారింది. మిత్రపక్షంతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని పార్టీకి చెందిన నేత ఎన్డీఏకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పంచన చేరడం సంచలనంగా మారింది. రాష్ర్టీయ లోక్‌సమతా నాయకుడు ఉపేంద్ర కుష్వాహ్ నిర్ణయం ఎన్డీఏ కూటమిని కుదుపులకు లోను చేస్తోందని అంటున్నారు.