Begin typing your search above and press return to search.
టీడీపీలోకి వైసీపీ మహిళా ఎమ్మెల్యే
By: Tupaki Desk | 19 Dec 2016 5:57 AM GMTవైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయి కొద్దినెలలైంది. మారిన పరిస్థితుల్లో ఎవరూ టీడీపీలోకి వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. కానీ... ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేను టీడీపీ తమ వైపు తిప్పుకొంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల్లో ఆ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన తెలుగుదేశంలో చేరేందుకు ముహూర్తం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరిగింది. వైసిపి కేంద్ర కమిటీ సభ్యురాలిగా బాధ్యత నిర్వహిస్తున్న కల్పన కొన్ని నెలలుగా టిడిపిలో చేరతారన్న ప్రచారం జరుగుతున్నా ఆమె వాటిని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుండి ఆదివారంనాడు కల్పనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.
మరోవైపు వైసిపి నాయకులు కూడా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. కల్పన టీడీపీలో చేరుతారని పలువురు వైసీపీ నేతలూ అంటున్నారు. అయితే... కల్పన మాత్రం దీనిపై ఇంతవరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఆమె కనుక తెలుగుదేశంలో చేరితే పామర్రు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. అదేసమయంలో దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉండడం... బీజేపీతో టీడీపీకి మైత్రి ఉండడం.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడతో ఇలాంటి సమయంలో టీడీపీలో చేరితే ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది అనుమానమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/