Begin typing your search above and press return to search.
ఉగ్రవాదుల వద్ద ఉన్నవన్నీ మేడిన్ పాకిస్థానే!
By: Tupaki Desk | 20 Sep 2016 4:48 AM GMTఉరి ఉగ్రవాదుల దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులకు సంబందించిన చివరి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దొంగ దెబ్బ అనంతరం కూడా భారత సైన్యం ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. అది ఎలా అంటే.. వాళ్ల కడుపులోనూ - గుండెల నిండా బుల్లెట్లు నిండిపోయేలా.. శరీరం మొత్తం జల్లెడైపోయేలా. అవును.. భారత సైనిక శిబిరంపై దాడికి తెగబడిన ఉగ్రవాదులకు సంబందించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిద్రిస్తున్న సైనికులపై దొంగదెబ్బ తీసిన ఆ ఆ నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలకు తాజాగా పొస్ట్ మార్టం జరిగింది. ఆ పొస్ట్ మార్టం అనంతరం వైద్యులు ఈ విషయాలు వెల్లడించారు.
ఉది దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులంతా 20ఏళ్ల లోపు వారేనని.. వారంతా రెగ్యులర్ ఉగ్రవాదుల్లా గెడ్డాలు పెంచుకుని కాకుండా.. క్లీన్ షేవ్ చేసుకుని - జుట్టు కూడా కురచగా కత్తిరించుకుని భారతీయ సైనికుల్లా కనిపించే ప్రయత్నం చేశారని వైద్యులు తెలిపారు. ఈ సమయంలో దొంగ దెబ్బ తీసిన వారి శరీరం మొత్తం బుల్లెట్లతో నిండిపోయాయి. వాళ్ల పొట్ట - గుండెభాగాల్లో మొత్తం 169 బుల్లెట్లు దిగాయట. తూటాలతో శరీరం మొత్తం జల్లెడైపోవడమంటే ఇదేనేమో!!
ఇదే సమయంలో ఇనిస్టెంట్ ఎనర్జీ కోసం - ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న చాకెట్లు - రెడ్ బుల్ క్యాన్లు - కొన్ని మందులు కూడా వారి వద్ద ఉన్నాయట. ఈ సమయంలో ఈ ఉగ్రవాదులు వాడిన అన్ని వస్తువులు - తిను బండారాలపైన "మేడ్ ఇన్ పాకిస్థాన్" అని రాసి ఉంది.. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుందని వైద్యులు తెలిపారు. అనంతరం దాడి జరిగిన ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదుల మృతదేహాలను ఖననం చేశారు.