Begin typing your search above and press return to search.

ఉగ్రదాడి బాధితుల ఆవేశం ఈ రేంజ్ లో ఉంది!

By:  Tupaki Desk   |   8 Oct 2016 6:38 AM GMT
ఉగ్రదాడి బాధితుల ఆవేశం ఈ రేంజ్ లో ఉంది!
X
సర్జికల్ స్ట్రైక్ అనంతరం జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఉగ్రవాద బాదిత దేశాలు - ఉగ్రవాద వ్యతిరేక దేశాలు భారత్ సర్జికల్ స్ట్రైక్ ని అభినందిస్తూ - మద్దతు పలుకుతూ ఉంటే... ఉగ్రవాద సానుభూతిపర దేశాలు మాత్రం ఖండిస్తున్నాయి!! ఈ క్రమంలో దేశంలో కూడా కొందరు నాయకులు ఈ సర్జికల్ స్ట్రైక్ ని ప్రశ్నిస్తున్నారు. అసలు సర్జికల్ దాడులు జరిగాయా లేక... సైన్యం సరిహద్దుల్లో ఎప్పుడూ జరిపే కాల్పులనే అలా చిత్రీకరించిందా అంటూ కొందరు నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలపై ఉగ్రవాద దాడి బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి ఇలాంటి నాయకులే కారణమని తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

ఉడీ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ అశోక్ కుమార్ సింగ్ కుటుంబం ఈ నాయకులమీద దాడులు చేయాలని ఏకంగా ప్రధానమంత్రి మోడీని కోరుతోంది. సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రశ్నిస్తున్న - అనుమానిస్తున్న నాయకులు దేశ ద్రోహులని అశోక్ కుమార్ సింగ్ భార్య అంటున్నారు. ఒక అమర సైనికుడి కుటుంబం ఎంత బాధపడుతుందో ఇలాంటి నాయకులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని.. ఇలాంటి నాయకులకు విషమిచ్చి చంపాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సర్జికల్ స్ట్రైక్స్‌ ను ప్రశ్నిస్తున్న నాయకులపై భారత నాయకులపై ఉడీ ఉగ్రదాడి బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సింది ఉగ్రవాదుల మీద కాదు, ముందుగా ఇలాంటి నాయకుల మీద చేయాలి అనేస్థాయిలో వారు ఆవేదన - ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే క్రమంలో మరో అడుగు ముందుకేసి అసలు దేశంలోకి ఉగ్రవాదులు చొరబడటానికి ఇలాంటి నాయకులే కారణమని సైతం ఈ బాదిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తో పాటు కాంగ్రెస్ నాయకులు సంజయ్ నిరుపమ్ - పి.చిదంబరం కూడా సర్జికల్ దాడుల వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేయడం - పాక్ పత్రికలలో వాళ్ల డిమాండ్లు పతాక శీర్షికలలో కనిపించడం తెలిసిందే! ఈ క్రమంలోనే బాదిత కుటుంబాలు ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/