Begin typing your search above and press return to search.

మోడీకి స్ట్రాంగ్ ఝ‌ల‌క్!

By:  Tupaki Desk   |   10 Dec 2018 12:33 PM GMT
మోడీకి స్ట్రాంగ్ ఝ‌ల‌క్!
X
మోడీకి మ‌రో భారీ షాక్ త‌గిలింది. గాలి వార్త అనుకున్న ఘ‌ట‌న నిజ‌మైంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హారంతో విసిగి తెలిపిన నిర‌స‌న అని అంద‌రూ భావిస్తున్నారు. అయితే, ఉర్జిత్ మాత్రం తాను వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాజీనామా చేశాను అన్నారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వానికి-ఉర్జిత్‌ కు మ‌ధ్య పెద్ద వారే జ‌రుగుతోంది. దేశాన్ని దివాలా దిశ‌గా న‌డిపిస్తున్న న‌రేంద్ర మోడీ రిజర్వ్ బ్యాంకు నగదు నిల్వలను క‌రిగించాల‌ని చేసిన ప్ర‌య‌త్నాల‌ను ఉర్జిత్ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇది పూర్తిగా ప్ర‌భుత్వ వైఫల్యం. దీనిని ఉర్జిత్ ప‌టేలే కాదు కొందరు బోర్డు సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా సంచ‌ల‌నం అయ్యింది. 2016లో ప‌టేల్‌ ఆర్బీఐ గవర్నర్ అయ్యారు. ఆయ‌న హ‌యాంలోనే నోట్ల ర‌ద్దు జ‌రిగింది. ఇంకా ఏడాది పాటు ఆయ‌నకు ప‌ద‌వీ కాలం ఉంది. కొత్త నోట్ల‌న్నీ ఆయ‌న సంత‌కాల‌తోనే విడుద‌ల అయ్యాయి. పార్ల‌మెంటు స‌మావేశాలున్న నేపథ్యంలో ఉర్జిత్ రాజీనామా కేంద్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్ర‌మాదం ఉంది.

ఆయ‌న మాట‌ల్లో రాజీనామాలో పేర్కొన్న కార‌ణాలివి...

'వ్యక్తిగత కారణాలతోనే ఆర్బీఐ గవర్నర్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. రిజర్వ్ బ్యాంకుకు గత కొన్నేళ్లుగా వివిధ హోదాల్లో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను. ఇటీవ‌ల‌ రిజర్వ్ బ్యాంక్ సాధించిన ఘనతకు ఉద్యోగులు - అధికారుల క‌ష్టం ఉంది. తన సహచరులు, డైరెక్టర్ల విలువైన సూచ‌న‌లు ఉన్నాయి. వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. భవిష్యత్తులో ఆర్బీఐని ఈ బృందం ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళుతుంద‌ని ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్'