Begin typing your search above and press return to search.

బీఅలెర్ట్‌: మార్కెట్ల‌కు అమంగ‌ళం?

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:44 AM GMT
బీఅలెర్ట్‌:  మార్కెట్ల‌కు అమంగ‌ళం?
X
చాలామంది ఇంటికి రోజూ వ‌చ్చే న్యూస్ పేప‌ర్లో బిజినెస్ పేజీని చూసేటోళ్లు చాలా త‌క్కువ‌. అయితే.. స్పోర్ట్స్‌.. లేదంటే సినిమా.. అదీ అయ్యాక రాజ‌కీయాల మీద ఒక క‌న్నేయ‌టం మామూలే. రాజకీయాలు జీవితాన్ని ప్ర‌భావితం చేసినా.. రొచ్చు రాజ‌కీయాల్ని పొద్దుపొద్దున్నే చూసే క‌న్నా.. మ‌న‌సుకు హాయి క‌లిగించే సినిమా.. లేదంటే స్పోర్ట్స్ కు ప్రాధాన్యం ఇచ్చే వారే ఎక్కువ‌. చాలా త‌క్కువ మంది మాత్ర‌మే బిజినెస్ పేజీని రెగ్యుల‌ర్ గా ఫాలో అవుతూ ఉంటారు.

వార్త‌ల రీడ‌బులిటీ విష‌యంలో బిజినెస్ పేజీ వెనుక‌బ‌డి ఉన్న‌ప్ప‌టికీ.. ఇది చూపించే ప్ర‌భావం త‌క్కువేం కాదు. అనూహ్యంగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ మంగ‌ళ‌వారం అమంగ‌ళ‌వారంగా మారుతుంద‌న్న భ‌యాందోళ‌న‌లు మార్కెట్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశ ప్ర‌జ‌ల‌కు షాకిస్తూ.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేసిన ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ నిర్ణ‌యం ఒకప‌క్క‌.. సెమీఫైన‌ల్స్ గా అభివ‌ర్ణిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే రోజున మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురి అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు.

మోడీ ప్ర‌తికూలంగా మారిన ఈ రెండు ప‌రిణామాల‌తో మార్కెట్లు భారీ కుదుపున‌కు గురి అవుతాయ‌న్న అంచ‌నాలు ఎక్కువ అవుతున్నాయి. మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీసే ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ రోజు మార్కెట్లు మొత్తం బేర్ స్వైర విహారం చేస్తుంద‌న్న అంచ‌నాలు వెలువడుతున్నాయి. మార్కెట్లు మొత్తం ర‌క్త‌పాతంతో నిండుతాయ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే.. ఈ ప‌రిస్థితి చ‌క్క‌దిద్దుకోవ‌టానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని.. అప్ప‌టివ‌ర‌కూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న సూచ‌న చేస్తున్నారు. ఏమైనా ఈ రోజు అంత‌గా అచ్చిరాద‌న్న మాట స‌ర్వ‌త్రా వినిపిస్తున్న వేళ‌.. మార్కెట్ల ర‌క్త‌పాతం ఎంత స్థాయిలో ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.