Begin typing your search above and press return to search.
వర్మ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
By: Tupaki Desk | 13 April 2019 6:42 AM GMT2019 ఎన్నికల్లో సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 90వ దశకంలో సినిమా ఇండస్ట్రీని ఊపు ఊపేసిన రంగీలా ఉర్మిలా మతోంద్కర్ ఈసారి కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో దిగారు. ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు.
ముంబైలో ఉర్మిల ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా ప్రచారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హీటెక్కిస్తున్నాయి. నటిగా ఆదరించారని.. ప్రజాక్షేత్రంలో నేతగా వస్తున్నానని.. రాజకీయాల్లో రాణిస్తానని ఉర్మిళ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సినీ తారగా తనను చూడవద్దని.. ప్రజలకు మేలు చేసే నేతగా గుర్తించాలని కోరారు. ప్రజల నమ్మకాన్ని పొందుతానని పేర్కొన్నారు.
తాను ఎన్నికైతే ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తానని ఉర్మిళ హామీ ఇస్తున్నారు. మురికివాడలను బాగు చేస్తానని.. మహిళల ఆరోగ్యం, లోకల్ ట్రైన్ల సమస్యలు, ఇబ్బందులు తీరుస్తానని చెప్పారు. పబ్లిక్ టాయిలెట్లు, ఇతర సమస్యలను తీరుస్తానని చెప్పుకొచ్చారు. రాజకీయ అనుభవం లేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారని.. గెలుపుపై నమ్మకం లేకనే ఇలా తనపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుతం సినిమా కెరీర్ కు దూరంగా ఉన్నానని.. రాజకీయాలపైనే తన దృష్టి అని.. పాలిటిక్స్ మీదనే ఆసక్తితో రాజకీయ జీవితం ఆరంభించానని ఉర్మిల పేర్కొన్నారు. సినిమాలను వదిలేశానని స్పష్టం చేశారు.