Begin typing your search above and press return to search.

అందంగా ఉంద‌ని ఫైన్ వేశాడు!

By:  Tupaki Desk   |   9 Jun 2019 12:18 PM GMT
అందంగా ఉంద‌ని ఫైన్ వేశాడు!
X
త‌ప్పులు చేసినందుకు ఫైన్లు వేయ‌టం మామూలే. నో పార్కింగ్ ప్లేస్ లో వాహ‌నాలు పార్కు చేసిందుకు.. ట్రిఫుల్ రైడింగ్‌కు.. హెల్మెట్ పెట్టుకోలేద‌ని.. సీటు బెల్ట్ పెట్టుకోలేద‌ని.. రాంగ్ రూట్లో వాహ‌నాలు న‌డిపే వారికి ఫైన్ వేయ‌టం తెలిసిందే. అందుకు భిన్నంగా ఇప్పుడు ఎక్క‌డా విన‌ని విధంగా అందంగా ఉందన్న కార‌ణంగా ఒక అమ్మాయికి ఫైన్ వేసిన సంఘ‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

బైక్ మీద వెళుతున్న ఒక మ‌హిళ అందంగా ఉండ‌టంతో.. ఇంత అందంగా ఉన్నందుకు ఫైన్ అంటూ చ‌లానా రాసివ్వ‌ట‌మే కాదు.. అందంగా ఉండ‌ట‌మే నేర‌మ‌న్న విష‌యాన్ని రాసేసిన చిత్ర‌మైన ఉదంతం ఉరుగ్వేలో చోటు చేసుకుంది. బైక్ మీద వెళుతున్న ఒక అమ్మాయి చాలా అందంగా ఉందంటూ ఒక పోలీసు ఆమెకు జ‌రిమానా విధించాడు.

అయితే.. అదేమీ అక్క‌డ రూల్ కాదు. మ‌నోడి తింగ‌రి వేషాలు వేశాడు. రోటీన్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించి ఆమెను ఇంప్రెస్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు.. ఈ ఉదంతం మే 25న ఉరుగ్వేలోని పేసందు అనే పట్ట‌ణంలో చోటు చేసుకుంది. అందంగా ఉండి ప‌బ్లిక్ రోడ్డులో వెళుతున్నందుకు ఫైన్ క‌ట్టండి అంటూ రాసిచ్చాడు.

మ‌నోడి యేషాలు ఆమెకు మంట పుట్టింది. అత‌గాడి ట్రిక్ కు ఇంప్రెస్ కావ‌టం త‌ర్వాత‌.. ఒళ్లు మండి దానిపై కంప్లైంట్ చేసింది. ఈ ఉదంతం ఒక్క‌సారిగా పెను వివాదంగా మారింది. మ‌నోడి మ‌న‌సు పారేసుకోవ‌టం త‌ర్వాత‌.. డ్యూటీలో ఉండి ఇంత బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రించినందుకు అత‌గాడి మీద విచార‌ణ జ‌రుపుతున్నారు. చ‌లానా ఘ‌న‌కార్యం చేసినందుకు ఆ కుర్ర పోలీసు ఉద్యోగం ఊడిపోయేలా ఉన్న‌ట్లు చెబుతున్నారు.