Begin typing your search above and press return to search.
ఊర్వశీ.. అంబానీ ఆస్పత్రి చుట్టూనే ఎందుకు ఈ చక్కర్లు?
By: Tupaki Desk | 6 Jan 2023 4:35 AM GMTబాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా సంక్రాంతి బరిలో విడుదలవుతున్న మెగా మూవీ 'వాల్తేరు వీరయ్య'లో అదిరిపోయే ఐటమ్ నంబర్ తో ఓలలాడించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన విజువల్స్ లో ఊర్వశి లుక్ ఆహార్యం మాస్ ని కట్టి పడేస్తున్నాయి. రౌతేలా ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలాలని కలలుగంటోంది.
ఊర్వశి రౌతేలా గురించి ప్రస్థావిస్తే అభిమానులు కేవలం ఐటమ్ నంబర్ గురించే కాదు.. వెంటనే క్రికెటర్ రిషబ్ పంత్ పేరును ప్రస్థావిస్తారు. కొత్త సంవత్సర వేడుకల వేళ క్రికెటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కి గురవ్వడం అటుపై అతడిని ఆస్పత్రికి తరలించిన విజువల్స్ వైరల్ అయ్యాయి. ఘోర ప్రమాదంలో చిక్కుకున్న రిషబ్ ను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కి తరలించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఊర్వశి రౌతేలా కూడా ఒక ఫుటేజ్ ని షేర్ చేసారు. త్వరలో పంత్ కి శస్త్రచికిత్స జరగనుందని తెలిపారు.
పంజాబీ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. క్రికెటర్ రిషబ్ పంత్ శస్త్రచికిత్స జరిగే ఆసుపత్రి పరిసరాల్లో ఇటీవల కనిపించడంపైనా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. తాజాగా ఊర్వశి తన ఇన్ స్టా స్టోరీస్ లో ధీరూభాయి అంబానీ ఆసుపత్రి భవనం తాలూకా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసింది. తను మాజీ ప్రేమికుడు చేరిన ఆసుపత్రికి సమీపంలో ఉందని దీనిని బట్టి నిర్ధారణ అయ్యింది. నగరం పేరును జియోట్యాగింగ్ చేస్తూ ఈ ఫోటోని ఎలాంటి క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేసింది.
రిషబ్ పంత్ కు శస్త్రచికిత్స నిమిత్తం బుధవారం నాడు డెహ్రాడూన్ నుంచి విమానంలో ముంబైకి తరలించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ రిషబ్ కు శస్త్రచికిత్స జరుగుతుందనేది ఈ ప్రకటన సారం. రిషబ్ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ - మెడికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి... సెంటర్ ఫర్ స్పోర్ట్స్ మెడిసిన్ హెడ్ డాక్టర్ దిన్ షా పార్దివాలా హాస్పిటల్ లోని ఆర్థ్రోస్కోపీ అండ్ షోల్డర్ సర్వీస్ డైరెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్నాడు. రిషబ్ కు శస్త్రచికిత్స జరుగుతుంది. అతడికి సంబంధించిన ప్రతిదీ BCCI వైద్య బృందం పర్యవేక్షిస్తుంది! అని BCCI అధికారిక ప్రకటనలో తెలిపింది.
కొత్త సంవత్సరానికి ముందు డిసెంబర్ 30న రిషబ్ కారు ప్రమాదానికి గురయ్యాడు. అతను ఢిల్లీ నుండి రూర్కీకి తిరిగి వస్తుండగా హమ్మద్ పూర్ ఝల్ సమీపంలో రూర్కీలోని నర్సన్ సరిహద్దులో అతని కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ప్రమాదం జరిగినప్పుడు కారులో రిషబ్ ఒక్కడే ఉన్నాడు. అతని వీపు- నుదురు- కాలికి గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత కార్ తగులబడిపోయింది.
అతని యాక్సిడెంట్ వార్త విన్న తర్వాత ఊర్వశి తన ఫోటో షూట్ లలోని ఒక ఫోటోని పోస్ట్ చేసి హార్ట్ ఈమోజీ..పావురం ఎమోజిలను షేర్ చేసింది. ''ప్రార్థిస్తున్నాను #ప్రేమ #ఊర్వశి రౌతేలా #UR1'' అని క్యాప్షన్ ఇచ్చింది. కానీ రిషబ్ పేరును ఇందులో రాయలేదు. నేను మీ కోసం - మీ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను అని మరోసారి ట్వీట్ చేసింది. తర్వాత ఊర్వశి తల్లి మీరా రౌతేలా రిషబ్ కోలుకోవాలని ఒక పోస్ట్ ని చేసారు. ''సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయడం వేరు ..ఉత్తరాఖండ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందడం వేరు. సిద్ధబలి బాబా మిమ్మల్ని ఆశీర్వధించాలి. దయచేసి రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి!'' అని వ్యాఖ్యానించారు.
గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తనను కలవడానికి 'మిస్టర్ ఆర్.పి'(రిషబ్ పంత్) చాలా సమయం వేచి ఉన్నాడని .. తనను సంప్రదించడానికి 16-17 మిస్డ్ కాల్స్ ఇచ్చాడని ఊర్వశి పేర్కొంది. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో క్రిప్టిక్ పోస్ట్ ల పరంపర మొదలైంది. ఊర్వశిపై రిషబ్ అభిమానులు తీవ్రమైన ట్రోలింగ్ తో ఎదురు దాడులు చేసారు. ఈ ఎపిసోడ్ పెద్ద రచ్చయిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.