Begin typing your search above and press return to search.

కరోనా సృష్టికర్త చైనానే..పరిహారం కోరుతూ కేసు

By:  Tupaki Desk   |   25 March 2020 10:38 AM GMT
కరోనా సృష్టికర్త చైనానే..పరిహారం కోరుతూ కేసు
X
కరోనా వైరస్.. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచానికి పాకి వేలమంది ప్రాణాలు తీస్తోంది. కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆడిపోసుకుంటున్నారు. చైనానే ఈ వైరస్ ను తయారు చేసి యాంటీడోట్ ముందే తయారు చేసుకొని తగ్గించుకుందని.. ప్రపంచం మీదకు వదిలిందనే అపవాదు కూడా ఉంది.

ఈ వార్తలకు బేస్ చేసుకొని కరోనా చైనా సృష్టియేనని ఆరోపిస్తూ వాషింగ్టన్ కు చెందిన న్యాయవాది లారీ క్లేమన్ చైనాపై 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేశారు. అమెరికన్లతోపాటు తమ ప్రత్యర్థి దేశాలకు చెందిన ప్రజలను చంపే ఉద్దేశంతోనే చైనా తమ లేబొరేటరీలో ఈ వైరస్ ను అభివృద్ధి చేసిందని లాయర్ లారీ క్లేమన్ ఆరోపించారు.

ఈ మేరకు టెక్సాస్ లోని కోర్టులో లారీ క్లేమన్ కేసు నమోదు చేయించి పిటీషన్ వేశారు. చైనా ఈ కరోనా వైరస్ ను జీవ ఆయుధంగా తయారు చేసిందని.. అమెరికా చట్టంతోపాటు పాటు అంతర్జాతీయ చట్టాలు - ఒప్పందాలు నిబంధనలు ఉల్లంఘించిందన్నారు.

చైనా వల్ల ప్రపంచానికి వాటిల్లిన నష్టానికి గాను 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారంగా చెల్లించాలని క్లేమన్ ఆరోపించారు. వూహాన్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ వైరస్ ను విడుదల చేసిందని ఆరోపించారు.

మరోవైపు అమెరికానే కుట్రపన్ని ఈ వైరస్ ను తమకు అంటగట్టిందని చైనా ఆరోపిస్తోంది. ఈ వైరస్ పై హెచ్చరించిన వారిని కూడా చైనా శిక్షించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే.