Begin typing your search above and press return to search.
శరణార్థులని కూడా చూడకుండా..ట్రంప్ విద్వేశం
By: Tupaki Desk | 27 Nov 2018 8:23 AM GMTఅమెరికా-మెక్సికో సరిహద్దుల్లో భీతావాహ వాతావరణం నెలకొంది. మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి వలస రావడానికి ప్రయత్నిస్తున్న ‘హోండరస్’ దేశ శరణార్థులను అమెరికా సైన్యం అనుమతించకపోవడం.. వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగించడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. శరణార్థులపై ఇలా అమానుష చర్యకు దిగిన ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ‘జరో టాలరెన్స్’ విధానం పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా అమెరికా సరిహద్దుల్లో మెక్సికో నుంచి శరణార్థులు తమ దేశంలోకి రాకుండా యూఎస్ సరిహద్దు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. పిల్లలపై కూడా భాష్పవాయు ప్రయోగం జరగడంతో కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. మారియా మెజా అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి శరణార్థుల శిబిరం వైపు పరిగెడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెక్సికో పోలీసులు తమను పోకుండా అడ్డుకున్నారని.. కానీ అమెరికా పోలీసులు మాత్రం భాష్పవాయువు ప్రయోగిస్తే నా కుమారుడు సొమ్మసిల్లి పడిపోయాడని ఆ మహిళ కన్నీరు కార్చడం ప్రపంచవ్యాప్తంగా అందరినీ కంటతడి పెట్టించింది. టియర్ గ్యాస్ కు చచ్చిపోతామేమోనని భయం వేసిందని వాపోయింది. పిల్లలను పట్టుకొని అందుకే పరిగెత్తానని తెలిపింది. ఎక్కడున్నా సరే నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు అంటూ కన్నీళ్లపర్యంతం అయ్యింది.
ప్రస్తుతం మెజా మెక్సికోలోని తిజువానా పట్టణంలోని శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందుతోంది. కాగా వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం టియర్ గ్యాస్ ప్రయోగించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ట్రంప్ మాత్రం దీన్ని కొట్టిపారేశారు. హోండరస్ లోని పరిస్థితులను తమ దేశానికి ఆపాదిస్తూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమెరికాలో అక్రమంగా చొరబడి ఆర్ధికంగా లబ్ధి పొందేందుకే కొందరు ఆశావాదులు ఇలా చేస్తున్నారని విమర్శించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా చట్టసభ ప్రతినిధులు - మానవ హక్కుల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సరిహద్దుల్లో చోటు చేసుకున్న హింస ఫొటోలు - వీడియోలు చూసి మాట్లాడాలని ట్రంప్ కు హితవు పలికారు.