Begin typing your search above and press return to search.
అమెరికా రాకెట్ల దాడి .... వణికిపోతున్న ఇరాన్ ,ఇరాక్
By: Tupaki Desk | 4 Jan 2020 5:00 AM GMTఇరాక్ పై అగ్రరాజ్యం అమెరికా వరుసగా రెండోరోజు కూడా దాడులకు పాల్పడింది. అమెరికా చేసిన ఈ రాకెట్ దాడులతో ఇరాక్ బెంబేలెత్తిపోయింది. అమెరికా రక్షణ దళాలు బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడి చేశాయి. వేకువజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్, ఇరాక్ కు చెందిన ఉన్నత కమాండర్లు సహా ఎనిమిది మంది చని పోయారు. ఇరాక్ మిలీషియా కమాండర్ లక్ష్యంగా వైమానికి దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రపంచ దేశాల్లో కలవరం కలిగించింది. అసలే ఇరాన్ మొండిఘటం. ఆ దేశ పాలకులతో పెట్టుకుంటే... ప్రశాంతంగా చూస్తూ ఊరుకోరు. అందుకే అమెరికా కావాలనే ఇరాన్ ను రెచ్చగొడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ ఘటనలో మిలిటరీ ఉన్నతాధికారి ఖాఈం సొలెమన్ కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రాకెట్ దాడిలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే ఈ దాడికి పాల్పడినట్టు పెంటాగన్ ప్రకటించింది. దీనిపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ కూడా కొంచెం ఘాటుగా స్పందించారు. దెబ్బకు దెబ్బ తీస్తామని అమెరికా ను హెచ్చరించారు. దీనితో రెండు దేశాలూ సంయమనం పాటించాలని భారత్ సహా ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. అయితే, అమెరికా మాత్రం, ఇరాన్ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాల్ని మోహరించింది. ఏ క్షణమైనా ఇరాన్ పై దాడికి దిగేలా అన్ని ఏర్పాట్లని పూర్తి చేసుకుంది. అటు ఇరాన్ కూడా అమెరికాను ఎలా దెబ్బతియ్యాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది.