Begin typing your search above and press return to search.

పాక్ గగనతల ప్రయాణం చాలా ప్రమాదకరం..హెచ్చరించిన యుఎస్ !

By:  Tupaki Desk   |   3 Jan 2020 8:32 AM GMT
పాక్ గగనతల ప్రయాణం చాలా ప్రమాదకరం..హెచ్చరించిన యుఎస్ !
X
పాకిస్థాన్ ప్రపంచ దేశాలలో వేరయా అని చెప్పాలి. అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఎలా అని ఆలోచిస్తుంటే ..పాక్ మాత్రం ఉగ్రవాదాన్ని తమ దేశంలోనే పెంచి పోషిస్తుంటుంది. పాక్ కి , ఉగ్రవాదానికి చాలా అభినాభావ సంబంధం ఉంది. పైపైకి మాత్రం మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని పాక్ చెప్తున్నప్పటికీ కూడా పాక్ లో ఉగ్ర స్థావరాలకి కొదవే లేదు. దీనితో ఉగ్ర చర్యల వల్ల పాక్‌ గగనతలంపై ప్రయాణం చాలా ప్రమాదకరం అని , పాకిస్థాన్ గగనతలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని అమెరికా నిషేధాజ్ఞలు జారీ చేసింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈమేరకు అమెరికా ఎయిర్ లైన్స్ సంస్థలకు, అందులో పనిచేసే పైలెట్లకు ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ ను వాడటం రిస్క్ తో కూడుకున్న పని అని - అక్కడ తీవ్రవాదులు - మిలిటెంట్ కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయని, దీనితో విమానాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగాఉన్నాయని యూఎస్ అభిప్రాయపడింది. యూఎస్ పౌర విమానయాన కార్యకలాపాలకు పాకిస్థాన్ గగనతలంపై అవాంతరాలు ఏర్పడవచ్చని భావించిన తరువాతనే గత ఏడాది డిసెంబర్‌లో దీనిపై ఎయిర్‌మెన్లకు నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌ మెన్‌ ) జారీ చేసిందని అమెరికా అధికారులు వెల్లడించారు. ఇది అన్ని యూఎస్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థలకు, పైలెట్లకూ వర్తిస్తుందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ముఖ్యంగా పాక్ గగనతళం పై తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలకి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.