Begin typing your search above and press return to search.

అమెరికాను నేరుగా దెబ్బేసిన ఐఎస్

By:  Tupaki Desk   |   5 Dec 2015 10:18 AM IST
అమెరికాను నేరుగా దెబ్బేసిన ఐఎస్
X
అమెరికాను అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పటం.. ఏకంగా వైట్ హౌస్ ను బాంబులతో పేల్చేస్తామంటూ వీడియోలు విడుదల చేస్తూ కలకలం సృష్టించి ఐఎస్ తీవ్రవాదులు..తమ తర్వాతి లక్ష్యం అమెరికానే అంటూ హెచ్చరికలు చేశారు. ఐఎస్ తీవ్రవాదులు విడుదల చేసిన వీడియోలు చూసిన వారు.. ఇదంతా సాధ్యం కాదని.. అమెరికా లాంటి అగ్ర రాజ్యం మీద దాడులు చేయటమా? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.

తాజాగా చోటు చేసుకున్న ఘటన చూస్తే.. అమెరికాలో మారణహోమాన్ని సృష్టించింది ఇంకెవరోకాదు.. ఐఎస్ తీవ్రవాదుల అంశేనని తేలింది. దీంతో అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల వికలాంగుల సంస్థలో జరిపిన క్రిస్మస్ పార్టీ సందర్భంగా వారితో గొడవ పడి.. కొద్ది వ్యవధిలో సాయుధులుగా తిరిగి వచ్చి.. ఇష్టారాజ్యంగా కాల్పులు జరపటం .. ఏకంగా 14 మంది అమెరికన్లను పొట్టనబెట్టుకోవటం తెలిసిందే.

ఈ దాడికి పాల్పడిన దంపతులిద్దరూ ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయని తేలింది. పాకిస్థాన్ పౌరురాలు తష్ ఫీన్ మాలిక్.. ఆమె భర్త సయ్యద్ ఫరూఖ్ లకు ఐఎస్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి అమెరికా భద్రతా సంస్థ మరింత లోతుగా దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు. తాజా దడి నేపథ్యంలో ఐఎస్ తీవ్రవాదుల మాటల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదన్న విషయం మరోసారి నిరూపితమైనట్లే. క్రిస్మస్ పార్టీ మీదా విచక్షణా రహితంగా దాడులకు పాల్పడి.. పారిపోతున్న వారిని భద్రతా దళాలు వెంటాడి వారిని హతమార్చారు.

తాజా ఘటన నేపథ్యంలో అమెరికా మరింత అలెర్ట్ గా ఉండాలన్న విషయం స్పష్టమవుతోంది. ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా రక్తపాతం ఖాయమన్న విషయం తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుందని చప్పక తప్పుదు.