Begin typing your search above and press return to search.

కొత్త త‌ర‌హా విమానాలు వ‌చ్చేస్తున్నాయ్‌..!

By:  Tupaki Desk   |   13 Nov 2017 1:53 PM GMT
కొత్త త‌ర‌హా విమానాలు వ‌చ్చేస్తున్నాయ్‌..!
X
కాలం క‌రిగే కొద్దీ కొత్త విమానాలు వ‌స్తున్నాయి. ప్ర‌యాణ రూపురేఖ‌లు మార్చేసే స‌రికొత్త టెక్నాల‌జీ త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక‌త‌తో ఊహించ‌ని రీతిలో సౌక‌ర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్ప‌టికి ఉన్న ప్ర‌యాణ స‌మ‌యాన్ని భారీగా త‌గ్గించేలా స‌రికొత్త విమానాలు వ‌స్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

అత్యంత వేగంగా ప్ర‌యాణించే సూప‌ర్ సోనిక్ విమానాల త‌మ్ముళ్ల మాదిరి కొత్త విమానాలు రానున్నాయి. ఈ విమానాలు మామూలు ఫ్లైట్ల కంటే 2.6 రెట్లు ఎక్కువ వేగంతో ప్ర‌యాణించ‌నున్నాయి. దీంతో జ‌ర్నీ టైం భారీగా త‌గ్గ‌నుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న విమానాల‌వేగంలో దుబాయ్ నుంచి లండ‌న్‌కు ప్ర‌యాణ స‌మ‌యం ఎనిమిది గంట‌లు ప‌డుతోంది. అయితే.. స‌రికొత్త విమానాల్లో ఈ ప్ర‌యాణ స‌మ‌యం కేవ‌లం 4.30 గంట‌లు మాత్ర‌మేనట‌.

అయితే.. ఈ విమానంలో కేవ‌లం 59 మాత్ర‌మే కూర్చునే అవ‌కాశం ఉంది. మామూలు విమానాల‌కు.. ఈ కొత్త త‌ర‌హా విమానాల మ‌ధ్య వ్య‌త్యాసాన్ని గుర్తించే ప‌రిస్థితి ఉండ‌ద‌ట‌. ఎందుకంటే.. శ‌బ్దంలోనూ ఈ కొత్తత‌ర‌హా విమానం సాధార‌ణ విమానం మాదిరే ఉండ‌నుంది. వ‌చ్చే ఏడాది నుంచి ఈ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సూప‌ర్ సోనిక్ విమానాలు అందుబాటులోకి రావ‌టంతో విమాన ప్ర‌యాణ రూపురేఖ‌లు మొత్తంగా మారిపోనున్నాయి. సుదూర తీరాల మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యం భారీగా త‌గ్గిపోనుంది. ఇప్ప‌టికే వేగ‌వంత‌మైన జీవితం మ‌రింత వేగంగా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు. సిటీల్లో సినిమాకు వెళ్లి వ‌చ్చే స‌మ‌యంలో దుబాయ్ నుంచి లండ‌న్ మ‌ధ్య ప్ర‌యాణం పూర్తి కానుంది.