Begin typing your search above and press return to search.
అమెరికాలో భారతీయ టెకీకి 9 ఏళ్ల జైలు
By: Tupaki Desk | 14 Dec 2018 5:25 AM GMTతమిళనాడుకు చెందిన ఇండియన్ టెకీకి అమెరికాలో గురువారం తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ ఏడాది జనవరిలో మహిళా ప్రయాణికురాలి పట్ల ఈ టెకీ అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురిచేయడంతో కోర్టులో నిర్ధారణ అయ్యి ఈ యువకుడికి ఈ భారీ శిక్ష పడింది.
ప్రభు రామ్మూర్తి (35) 2015లో హెచ్1బీ వీసాపై అమెరికాకు వచ్చాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అమెరికాలో పనిచేస్తున్నారు. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఫెడరల్ కోర్టులో నిరూపితమైంది. జడ్జి టెర్రన్స్ బెర్జ్ ఇలాంటి నేరాలకు కఠిన శిక్ష విధించాలని 11 ఏళ్లు జైలు శిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ వాదనకు మద్దతుగా మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరు విమానంలో ప్రయాణించేటప్పుడు సురక్షితంగా.. స్వేచ్చగా ప్రయాణించే హక్కు కలిగి ఉంటారు. ఇలా లైంగిక వేధింపులకు - అసభ్య ప్రవర్తనను తాము సహించలేం. ’ అంటూ తీర్పు వెలువడ్డాక అమెరికా అటార్నీ జనరల్ మాథ్యూ షెండర్ వ్యాఖ్యానించారు.
జడ్జి టెర్రెన్స్ బెర్జ్ ఆగస్టులో ప్రభు రూమ్మూర్తిని దోషిగా నిర్ధారించారు. దాదాపు మూడు గంటల చర్చల అనంతరం తాజాగా తీర్పును వెలువరించారు.
జనవరి 3న ప్రభు రామ్మూర్తి తన భార్యతో కలిసి లాస్ వేగాస్ నుంచి డెట్రాయిట్ కు విమానంలో వెళుతున్నాడు. పక్కన భార్య ఉండగానే పక్క సీట్లో పడుకున్న తోటి మహిళా ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి విమానంలో ఉన్న వీడియోల్లో సాక్ష్యంగా రికార్డ్ అయ్యింది. లైంగిక దాడికి పాల్పడుతుండగా మెళకువ వచ్చి మహిళ అరవడంతో విమాన సిబ్బంది రామ్మూర్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
అమెరికా ఎఫ్ బీఐ అధికారుల నివేదిక ప్రకారం 2014-2017వరకు చాలామంది భారతీయులు అమెరికాలో విమానంలో ప్రయాణిస్తుండగా లైంగిక దాడులకు పాల్పడ్డారని నివేదిక పేర్కొన్నారు. విమానంలో లైంగిక వేధింపులు తీవ్రమైన నేరంగా అమెరికాలో గుర్తిస్తారని ఎఫ్ బీఐ అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి కేసులు ఈ నాలుగేళ్లలో 66శాతం పెరిగాయని అంటున్నారు.
కోర్టు తీర్పు పత్రాల ప్రకారం.. ప్రభు రామ్మూర్తిది భారత్ లోని తమిళనాడు. అతడి తల్లిదండ్రులు రైతులు. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తికాగానే 2015లో అమెరికాకు వచ్చాడు. విచారణ సమయంలో ఇతడికి ఇంగ్లీష్ పరిజ్ఞానం - జాబ్ స్కిల్స్ లేకున్నా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్నాడని విచారణ అధికారులు - న్యాయవాదులు తేల్చారు. ఈ నేరానికి పాల్పడినా అతడిలో సానుభూతి - పశ్చాత్తాపం లేదని.. కఠిన శిక్ష విధించాలని న్యాయవాదులు కోర్టులో కోరడంతో జడ్జి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించారు.