Begin typing your search above and press return to search.
భారత్ టీకా ఉత్పత్తిని అడ్డుకుంటున్న అమెరికా!
By: Tupaki Desk | 20 April 2021 4:04 PM GMTభారత్ టీకా ఉత్పత్తిని అమెరికా అడ్డుకుంటోందా? టీకాల ఖార్కానా అయిన భారత్ ను అందులో ముందడుగు వేయకుండా ఆపుతోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. టీకా ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకుల విషయంలో అమెరికా అవసరాలకే పెద్దపీట వేయాలంటూ బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని అంటున్నారు.
దేశంలో ముడిసరుకుల కొరతతో ఇబ్బంది పడుతున్న సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాలా తాజాగా అమెరికా టీకాల తయారీకి అవసరమైన ముడిసరుకులను అడ్డుకుంటోందని.. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.'కరోనాను ఓడించేందుకు మనం అందరం ఏకమవ్వాలి. టీకా ముడిసరుకులు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను సడలించాలి' అని జోబైడెన్ ట్వీట్ చేశారు.
టీకాల తయారీలో అడ్డువెంట్స్ కీలక ముడిపదార్థాలు. వీటిని ఉత్పత్తి చేసేందుకు దేశీయంగా సాంకేతిక లేదు. అమెరికా వీటిని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో ఎగుమతిపై ఆంక్షలు విధించి దేశీయ టీకాదారులకే వీటిని ఇస్తోంది. దీంతో భారత్ లోని టీకా తయారీ సంస్థలు ఈ ముడిసరుకులు అందక టీకాలు తయారు చేయలేకపోతున్నాయి. దీంతో 'సీరం' సీఈవో తాజాగా అమెరికా అధ్యక్షుడికే ట్వీట్ చేశారు.
ఇక టీకాల డిమాండ్ దృష్ట్యా సీరం సంస్థకు ముడిసరుకులు అందకపోతున్నాయి. అయితే దేశీయ టీకా దిగ్గజం భారత్ బయోటెక్ మాత్రం దేశంలో అడ్డువెంట్స్ తయారీకి భారత ప్రభుత్వ సంస్థ'భారత పరిశోధన సంస్థ (ఐఐసీటీ)'తో ఒప్పందం చేసుకుంది. ఇక్కడి ఔషధ పరిశ్రమ నుంచే వాటిని తయారు చేయడం మొదలు పెట్టింది. దీంతో భారత్ బయోటెక్ టీకా ఉత్పత్తికి ఎలాంటి అడ్డంకులు లేకపోగా.. సీరం సంస్థ మాత్రం ఇబ్బంది పడుతోంది.