Begin typing your search above and press return to search.
అమెరికాలో పార్సిల్ బాంబుల కలకలం..
By: Tupaki Desk | 25 Oct 2018 10:47 AM GMTఅమెరికాలో పార్సిల్ బాంబులు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అగ్రరాజ్యంలోని అత్యంత కీలకమైన కార్యాలయాలకు పేలుడు పదార్థాలతో కూడిన పార్విళ్లు రావడం సంచలనం రేపుతోంది. నిఘా వర్గాలు గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అమెరికా సీక్రెట్ సర్వీసెస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ పేలుడు పదార్థాలతో కూడిన పార్సిళ్లు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా - మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ పేరు మీద వచ్చాయని తెలిపారు. హిల్లరీ - ఒబామాను చంపించే కుట్ర అని వారు అనుమానిస్తున్నారు. ఈ బాంబుల వెనుక ఎవరున్నారనే దానిపై ఆరాతీస్తున్నారు. రెండు రోజుల క్రితం బిలియనీర్ జార్జ్ సోరోస్ నివాసానికి కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాంబుల పార్సిల్ తేగా తనిఖీల్లో బయటపడింది.
తాజాగా అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్ కు కూడా అనుమానాస్పద పార్సిల్ వచ్చినట్లు ప్రఖ్యాత చానెల్ సీఎన్ ఎన్ పేర్కొనడం కలకలం రేపుతోంది. అయితే వైట్ హౌస్ పార్సిల్ పై స్పందించడానికి సీక్రెట్ సర్వీసెస్ నిరాకరించింది.
అమెరికాలో ప్రముఖులకు పంపుతున్న ఈ పార్సిల్ బాంబులపై యూఎన్ ఎఫ్బీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఆరాతీస్తున్నారు. త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.