Begin typing your search above and press return to search.

చైనా వ‌ల్ల అమెరికాలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు గ‌ల్లంతు!

By:  Tupaki Desk   |   23 March 2018 9:50 AM GMT
చైనా వ‌ల్ల అమెరికాలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు గ‌ల్లంతు!
X
కాదేదీ క‌విత‌క‌న‌ర్హం అని మ‌హాక‌వి శ్రీ‌శ్రీ గారు అన్న మాట‌ల‌ను చైనా వాళ్లు బాగా వంట‌బ‌ట్టించుకున్న‌ట్లున్నారు. అందుకే కాదేదీ కాపీక‌న‌ర్హం అంటూ మార్కెట్లో విడుద‌లైన ప్ర‌తి వ‌స్తువును చైనా చౌక ధ‌ర‌లోనే త‌యారుచేస్తుంటుంది. చైనా....అన‌గానే.....ఏదైనా చెయ్య‌నా....అని సిద్ధంగా ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో ఓ కామెంట్ ఉంది. అచ్చుగుద్దిన‌ట్లు అస‌లు వ‌స్తువును పోలిన‌ట్లుగా న‌క‌లును రూపొందించ‌డం - అతి చౌక ధ‌ర‌కే వాటిని మార్కెట్లోకి తీసుకురావ‌డం వారి ప్ర‌త్యేక‌త‌. ఇవి కాకుండా, కారుచౌక‌కే త‌యారు చేసే సొంత న‌మూనాలు - వ‌స్తువులు ఆ న‌కిలీ వ‌స్తువుల‌కు అద‌నం. మొత్తానికి - చౌక‌ధ‌ర‌ల్లో ల‌భించే చైనా వ‌స్తువుల‌కు ప‌లు ప్ర‌పంచ దేశాల‌తోపాటు అమెరికాలో కూడా గిరాకీ ఎక్కువ‌. చైనా వ‌స్తువుల ఎఫెక్ట్ తో అమెరికాలో వాణిజ్య‌లోటు 370 బిలియన్ డాలర్లకు చేర‌డంతో అమెరికా క‌ల‌వ‌ర‌ప‌డుతోంది.

చైనా చౌక ఉత్పత్తులు అమెరికాను కలవరపెడుతున్నాయ‌ని అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. చైనా వ‌స్తువుల దిగుమ‌తి కార‌ణంగా అమెరికాలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయ‌ని, దాదాపు 20 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయ‌ని చెప్పింది. చైనా అనైతిక వాణిజ్య విధానాలకు పాల్ప‌డుతోంద‌ని తెలిపింది. బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుకు 6,000 ఉద్యోగాలు కోల్పోయామని చెప్పింది. ఆ దిగుమ‌తుల కార‌ణంగా చైనాలో 20లక్షల ఉద్యోగాలు పెరిగాయ‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలకు విధించేందు అమెరికా సిద్ధ‌మైంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న 60 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై పన్నులను సమం చేయాలని అధికారులను అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. దీంతో, ఆ వ‌స్తువులు దిగుమ‌తిని నియంత్రించ‌వ‌చ్చిని అమెరికా యోచిస్తోంది.