Begin typing your search above and press return to search.
మన టెకీలకు అమెరికా అనూహ్య తీపికబరు
By: Tupaki Desk | 20 Dec 2017 5:07 PM GMTస్వదేశీ మంత్రం జపిస్తూ..ఓ వైపు హైటెక్ ఉద్యోగుల వలసలను నిరోధించే చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉధృతం చేస్తుండటం ఇటీవల నిరాశకు గురవుతున్న మన టెకీలకు తీపికబురు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నైపుణ్యతకు ద్వారాలు తెరిచి పెట్టారు. అమెరికాలో హెచ్1బీ వీసా పొందే వారిలో ముందు వరుసలో ఉన్న భారతీయులు కెనడాకు వెళుతున్న వారిలో కూడా అగ్రభాగాన నిలిచారు. ఇంతకుముందు కెనడా వీసా లభించేందుకు నెలల సమయం పట్టేదని ఇప్పుడు గరిష్ఠంగా పది రోజుల్లో అనుమతులు లభిస్తున్నాయని పలువురు హైటెక్ ఉద్యోగులు పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్యకాలంలో రెండువేల మంది విదేశీయులు కెనడాలో ఉద్యోగాలు సంపాదించగా వారిలో భారతీయులు 988 మంది ఉన్నారు. రెండో స్థానంలో 296 మందితో చైనా ఉంది. నూతన ‘గ్లోబల్ స్కిల్స్ స్ట్రాటజీ’ పేరిట కెనడా ఇటీవల ఫాస్ట్ ట్రాక్ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానం ఎంతో విజయవంతమైందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. వ్యాపారవర్గాల నుంచి ఈ ప్రతిపాదన వచ్చిందని ఆయన వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ ద్వారా వీసా పొందిన వారు మూడేళ్ల వరకు లేదా శాశ్వతంగా ఉండిపోయేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ విధానం ద్వారా కంప్యూటర్ ప్రోగ్రామర్లు - కంప్యూటర్ విశ్లేషకులు - సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు లబ్ధిపొందుతున్నారు. హెచ్1బీ వీసా విధానాన్ని నిరుత్సాహపరిచేందుకు అధ్యక్షుడు ట్రంప్ దాదాపు అన్ని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆ వీసా కోసం దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్యకూడా గణనీయంగా తగ్గిపోయింది. లాటరీ పద్ధతిలో వీసాలు పొందేందుకు దాఖలయ్యే దరఖాస్తులు ఐదేండ్లలో మొదటిసారిగా భారీగా తగ్గిపోయాయి.
లాటరీ పద్ధతిలో అమెరికా ప్రతి ఏడాది 85 వేల వీసాలు జారీ చేస్తుంది. ఇంతకాలం నిపుణులంతా అమెరికాకు క్యూ కట్టడాన్ని చూసిన కెనడా ఇప్పుడు ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. సృజనాత్మకతకు ద్వారాలు తెరువాలన్న కెనడా విధానంలో ఫాస్ట్ ట్రాక్ వీసా కార్యక్రమం ఒక భాగం మాత్రమే. కెనడా ప్రభుత్వం వెంచర్ క్యాపిటల్ కు - కృత్రిమ మేధస్సును ప్రోత్సహించేందుకు - లక్షల కోట్ల డాలర్లను గుమ్మరిస్తున్నది. దీంతో ఉపాధి అవకాశాలు భారీగా ఏర్పడనున్నాయి. గత ఏడాది కెనడా 3.20 లక్షల మందికి స్వాగతం పలికింది.