Begin typing your search above and press return to search.

స‌రిహ‌ద్దు ర‌చ్చ‌...మ‌న‌కు అమెరికా కితాబు

By:  Tupaki Desk   |   12 Aug 2017 4:51 PM GMT
స‌రిహ‌ద్దు ర‌చ్చ‌...మ‌న‌కు అమెరికా కితాబు
X
భార‌త దౌత్య‌నీతికి మ‌రోమారు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మ‌న సంయమ‌నం ఇన్నాళ్లు అంత‌ర్గ‌తంగా ఆయా దేశాల్లో ప్ర‌శంస‌నీయ రీతిలో ఉండ‌గా...తాజాగా అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన నిపుణుడు బ‌హిరంగంగానే త‌న కితాబును ఇచ్చారు. చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి ముఖ్యంగా డోక్లాం ముక్కోణ జంక్షన్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో భార‌త్ ప్ర‌శంస‌నీయ రీతిలో వ్య‌వ‌హ‌రించింద‌ని అమెరికాకు చెందిన నేవీ యుద్ధ కళాశాలకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఆర్‌ హోమ్స్ ప్ర‌శంసించారు.

సరిహద్దుల్లో చైనా భారీగా సైన్యాన్ని మోహరించిన నేపథ్యంలో భార‌త్ పొరుగుదేశం వ‌లే పెంకిత‌నానికి పోకుండా...ప‌రిణ‌తి చెందిన రీతిలో సంయమ‌నం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని త‌న విశ్లేష‌ణ‌లో తేలిన‌ట్లు ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఆర్‌ హోమ్స్ వివ‌రించారు. భార‌తదేశం తీరు వ‌ల్ల చైనా వ్య‌వ‌హ‌రశైలి, దూకుడు, వివాదాస్ప‌ద తీరు అంత‌ర్జాతీయంగా ఆ దేశంపై ఓ ముద్ర‌ను వేశాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ పరిధిలో అదనపు సైనిక బలగాలను మోహరించాలని చూడటం ద్వారా వివాదం కొన‌సాగాల‌ని చైనా చూస్తోంద‌ని ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఆర్‌ హోమ్స్ విశ్లేషించారు. కాగా, ఇరుదేశాల మ‌ధ్య స‌ఖ్య‌త విష‌యంలో మూడో ప‌క్షం జోక్యం గురించి కూడా ఈ నేవీ సీనియ‌ర్ విశ్లేషించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ స‌హా ఆయ‌న సల‌హాదారులు ఇత‌రుల జోక్యాన్ని స‌హించ‌ర‌ని అన్నారు. ఒక‌వేళ యుద్ధం సంభ‌విస్తే...భార‌త్‌కు మ‌ద్ద‌తుగానే అమెరికా ఉంటుంద‌న్నారు.

మ‌రోవైపు సిక్కిం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 1,400 కి.మీ పొడవునా కేంద్రం వ్యూహాత్మకంగా బలగాలను మోహరించిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు సుమారు 45 వేల మంది సైనికులను తరలించారని సమాచారం. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.