Begin typing your search above and press return to search.

అక్క‌డ 9525 కేజీల బాంబేసిన అమెరికా

By:  Tupaki Desk   |   14 April 2017 5:11 AM GMT
అక్క‌డ 9525 కేజీల బాంబేసిన అమెరికా
X
అగ్రరాజ్యం దూకుడుగా దూసుకెళుతోంది. తెంప‌రి ట్రంప్ అమెరికా అధ్యక్షుడ‌య్యాక ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయోన‌న్న సందేహాల‌కు త‌గ్గ‌ట్లే ఈ మ‌ధ్య‌న చోటు చేసుకున్న ప‌రిణామాలు శాంతికాముల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తున్నాయి. ట్రంప్ నిర్ణ‌యాల కార‌ణంగా ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అయ్యే ప‌రిస్థితి. మొన్న‌టికి మొన్న సిరియా ర‌సాయ‌నిక‌ బాంబు ప్ర‌యోగించ‌టం కార‌ణంగా వంద‌మందికి పైగా చిన్నారులు మృత్యువాత ప‌డ‌టం.. దీనికి సంబంధించిన ఫోటోలు విడుద‌లై.. అంద‌రి మ‌న‌సుల్ని క‌లచివేశాయి. ముక్కుప‌చ్చ‌లార‌ని బాల‌లు అంత భారీగా చ‌నిపోవ‌టం ప్ర‌పంచం మొత్తాన్ని తీవ్ర విషాదానికి గురి చేసింది.

సిరియా స‌ర్కారు తీరుతో ఊహించ‌ని రీతిలో క్షిప‌ణి దాడుల‌కు పాల్ప‌డి.. ప‌లు దేశాల్ని నివ్వెర పోయేలా చేసింది అమెరికా. అమెరికా బ‌ల‌గాలు.. ఇంత దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం వెనుక ట్రంప్ కార‌ణంగా చెబుతున్నారు. సిరియాపై అమెరికా చేసిన క్షిప‌ణి దాడిని ప‌లు దేశాలు ఖండిస్తే.. మ‌రికొన్ని దేశాలు త‌గిన శాస్తి జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకున్నారంటూ ప్ర‌శంసలు కురిపించాయి. సిరియాలో జ‌రిపిన క్షిప‌ణి దాడి సృష్టించిన వేడి ప‌రిణామాల‌కు మ‌రింత ఆజ్యం పోసేలా తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణ‌యం అవాక్కు అయ్యేలా చేస్తోంది.

పాకిస్థాన్‌ కు స‌రిహ‌ద్దు ప్రాంతానికి ద‌గ్గ‌రైన ఆఫ్ఘానిస్తాన్ లో ఐసిస్ తీవ్ర‌వాదులు భారీగా ఉన్న ప్రాంతంపై భారీ బాంబును తాజాగా ప్ర‌యోగించింది. 9525 కేజీల అణు ర‌హిత బాంబును ప్ర‌యోగించింది అమెరికా. భార‌త కాల‌మానం ప్ర‌కారం దాదాపు 7 గంట‌ల వేళ‌లో.. ఈ భారీ బాంబుతో ప్ర‌త్య‌ర్థిని అంత‌మొందించే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని అమెరికా ర‌క్ష‌ణ శాఖ అధికార‌ప్ర‌తినిధులు స్వ‌యంగా వెల్ల‌డించారు. అమెరికా ఇంత భారీ బాంబును ప్ర‌యోగించ‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ భారీ బాంబును ఎంసీ-130 ఎయిర్ క్రాఫ్ట్ నుంచి విడిచిన‌ట్లుగా వెల్ల‌డించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/