Begin typing your search above and press return to search.

భారతీయులకు మరో ఊరట కల్పించిన అమెరికా

By:  Tupaki Desk   |   18 July 2020 12:15 PM IST
భారతీయులకు మరో ఊరట కల్పించిన అమెరికా
X
హెచ్1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులైన తల్లిదండ్రి, భార్యా పిల్లలకు అమెరికాకు పోవడానికి అడ్డంకులు తొలిగిపోయాయి. డిసెంబర్ 31వరకు ఎవరూ అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో వారంతా విదేశాల్లోనే చిక్కుబడిపోయారు. వారందరికీ అమెరికా ఊరట కల్పించింది. ఇక హెచ్1బీ వీసాదారులతోపాటు అమెరికాలో ఉద్యోగాలు చేసే వారికి కూడా వెసులుబాటు కల్పించింది. హెచ్4 వీసా హోల్డర్లు సైతం అమెరికా ప్రయాణ నిషేధం నుండి మినహాయించబడ్డారు. అలాగే.. ఎల్ మరియు జె వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు.. ఆధారపడినవారు ట్రంప్ జూన్ 22 నుంచి విధించిన నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. వారంతా తిరిగి అమెరికాకు వెళ్లడానికి అనుమతించబడతారు.

కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో ఉద్భవించిన నిరుద్యోగం.. ఆర్థిక సంక్షోభం కారణంగా వలసేతర వీసాలను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల ప్రకటన ప్రకారం.. హెచ్ -1 బి, హెచ్ 4, జె 1, మరియు హెచ్ 2 ఎ వీసాలలో చెల్లుబాటు అయ్యే వీసా లేకుండా జూన్ 24 నాటికి అమెరికా వెళ్లడానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఎవరినీ అనుమతించదు.

ప్రాధమిక దరఖాస్తుదారులైన హెచ్1బీ, హెచ్4 తదితర వీసాదారులు ప్రస్తుతం అమెరికాలో ఉంటేనే డిపెండెంట్లు తిరిగి అమెరికాలో అనుమతించబడతారు. అలాగే, హెచ్ -1 బి వీసాదారులకు మినహాయింపు ఉంది. కానీ వారు క్లిష్టమైన అమెరికా విదేశాంగ విధాన లక్ష్యానికి మద్దతుగా పని చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వారి ప్రయాణానికి అనుమతించరు.. ఈ మినహాయింపు కొన్ని ఎంపిక చేసిన హెచ్.. జే వీసాలకు మాత్రమే కల్పించారు..

అమెరికా అధ్యక్ష ప్రకటనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసుల ఫలితంగా వలస రహిత వీసాలను సంవత్సరం చివరి వరకు నిలిపివేసింది. ఎంబసీ మూసివేత, విమాన ఆంక్షలు, యుఎస్‌లో ప్రయాణ నిషేధం కారణంగా భారతదేశంలో 1000 మందికి పైగా ప్రజలు చిక్కుకున్నట్లు తెలిసింది.