Begin typing your search above and press return to search.

కరోనా ట్రీట్ మెంట్ కు కొత్త మందు...USA ప్రకటన!

By:  Tupaki Desk   |   2 May 2020 1:00 PM IST
కరోనా ట్రీట్ మెంట్ కు కొత్త మందు...USA ప్రకటన!
X
కరోనా మహమ్మారి రోజురోజుకి ప్రపంచ వ్యాప్తంగా మరింతగా విజృంభిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో దీని ప్రభావం భారీ స్థాయిలో ఉంది. దీనికి ప్రధాన కారణం కరోనా కి సరైన వ్యాక్సిన్ లేకపోవడమే. ఇప్పటివరకు కరోనా భాదితులకు ఇప్పటివరకు ఉన్న డ్రగ్స్ తోనే చికిత్స అందిస్తున్నారు కరోనా కి సరైన వ్యాక్సిన్ కోసం ..ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా ట్రీట్ మెంట్ కు సంబంధించి అమెరికా కొత్త మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమర్జెన్సీ మెడిసిన్ గా కరోనా పేషెంట్లకు రెమ్ డెసివిర్ ను ఇవ్వొచ్చని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ డీ ఏ తెలిపింది. కరోనా నుండి పేషేంట్స్ ని కాపాడటానికి అనేక మెడిసిన్స్ ను పరీక్షిస్తున్న సమయంలో ఈ రెమ్ డెసివిర్ మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్టు అక్కడి వైద్యులు ద్రువీకరించడంతో ..కరోనా చికిత్స కోసం రెమ్ డెసివిర్ ను వాడేందుకు USA అధికారికంగా అనుమతులు ఇచ్చింది.

అయితే , కరోనా మహమ్మారితో ఆరోగ్య పరిస్థితి విషమించిన వారికి మాత్రమే ఈ మందు ఇవ్వాలని ఈ మందును తయారు చేసే గిలీడ్ సైన్సెస్ సంస్థ తెలిపింది. కరోనాతో ప్రాణపాయ స్థితిలోకి చేరకున్న వారికి ఇది దివ్యౌషధమని ఓడే తెలిపారు. ఈ మందుకు అనుమతులివ్వటం పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. రెమ్ డెసివిర్ వినియోగం తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారణ ఆయితే పూర్తి కరోనా నివారణకు పూర్తి స్థాయిలో ఈ మందు వాడుతామని అమెరికా తెలిపింది. రెమ్ డెసివిర్ ను ఎబోలా మరణాలను తగ్గించేందుకు ముందుగా తయారు చేశారు. కానీ పెద్ద ఎఫెక్ట్ గా పని చేయలేదు. కరోనా నివారణలో మాత్రం ఆశాజనక ఫలితాలు ఉన్నట్లు భావిస్తున్నారు.