Begin typing your search above and press return to search.
ఫేసబుక్ కు అమెరికా ఝలక్
By: Tupaki Desk | 9 Dec 2021 4:06 PM IST‘అమెరికా (స్థానిక) ఉద్యోగుల పట్ల వివక్ష’ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం... సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు పెద్ద షాకిచ్చింది. ఫేస్ బుక్ వైఖరిపై ఈ మేరకు వచ్చిన రెండు ఫిర్యాదులను పరిష్కరించింది. వీటిపై ఒప్పందం (సెటిల్) చేసుకునేందుకు ఫేస్ బుక్ సైతం అంగీకారానికి రావడం గమనార్హం.
మొత్తం వివాదానికి.. పీఈఆర్ఎం లేబర్ సర్టిఫికేషన్ కింద ఉద్యోగాల్లో అంతర్జాతీయ కార్మికులకు ప్రాధాన్యత ఇస్తూ, స్థానిక కార్మికులను విస్మరిస్తున్నారనే అంశం కేంద్ర స్థానమైంది. ఈ అంశంలో ఫేస్ బుక్ పై చాలాకాలంగా తీవ్ర విమర్శలున్నాయి. కంపెనీ వివక్షా పూరిత ధోరణిపై ఉద్యోగులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) ,యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ (డిఓఎల్) లో ఫిర్యాదు చేశారు.
ఫేస్‌బుక్‌పై రెండు సంస్థలు ఒక్కో దావా వేశాయి. దీంతో.. ఫేస్ బుక్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. సంక్షోభం నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా సాగించింది. డీవోజే, డీవోఎల్ దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించాలని నిర్ణయించుకుంది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఫేస్ బుక్ జరిమానా గా 4.75 మిలియన్ డాలర్లు చెల్లించనుంది.
వివక్ష ఎదుర్కొంటున్నామని ఆరోపించిన ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించనుంది. వీరిసంఖ్య కూడా పెద్దఎత్తునే ఉంటుందని సమాచారం. అయితే పీఈఆర్ఎం ప్రోగ్రామ్ కింద ఉద్యోగులను రిక్రూట్ చేసే మార్గదర్శకాల అమలులో ఫేస్ బుక్ ఉల్లంఘనలపై ఎలాంటి ఆధారాలు లేవని డీవోఎల్ స్పష్టం చేసింది. కానీ, సంస్థల యజమాన్యాలు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను తప్పకుండా అనుసరించాలని పేర్కొంది.
కాగా, రెండు వ్యాజ్యాల చరిత్రను పరిశీలిస్తే, ఫేస్‌బుక్ ద్వారా యూఎస్ కార్మికుల పట్ల ఆరోపించిన వివక్ష ఆధారంగా, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ గత సంవత్సరం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై దావా వేసింది. అమెరికాలో నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పటికీ ఫేస్‌బుక్ అంతర్జాతీయ కార్మికులకు ప్రాధాన్యత ఇస్తోందని సంస్థ అభిప్రాయపడింది.
మరోవైపు డీవోజే ఆరోపణలను కొట్టిపారేసినప్పటికీ, జరిమానాగా 4.75 మిలియన్ డాలర్లు చెల్లించడం ద్వారా దావాను పరిష్కరించుకోవాలని ఫేస్ బుక్ నిర్ణయించుకుంది. ఇక ఫేస్‌బుక్ ప్రవర్తన వల్ల తాము ప్రభావితమయ్యామని ఆరోపించిన స్థానిక కార్మికులకు 95 లక్షల డాలర్లు చెల్లిస్తుంది.