Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : కరోనా వ్యాక్సిన్ రెడీ.. నేడే ట్రయల్స్
By: Tupaki Desk | 16 March 2020 10:10 AM GMTప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ఫలించాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు మందును తయారు చేయడంలో కీలక ముందడుగు వేశారు. తాజాగా కరోనాకు ఓ వ్యాక్సిన్ ను తయారు చేశారు. అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ మేరకు నేడు తొలిసారి ఈ వ్యాక్సిన్ ను తొలిసారి ప్రయోగించనున్నామని తెలిపారు.
అమెరికాలోని వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేశారు. అమెరికా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దీనికి నిధులను సమకూర్చింది.
అయితే ఈ వ్యాక్సిన్ పనితీరును పూర్తి స్థాయిలో ధ్రువీకరించడానికి మరో 18 నెలలు వేచిచూడక తప్పదని పబ్లిక్ హెల్త్ అధికారులు తెలిపారు.
తాజాగా ఈ వ్యాక్సిన్ ను వేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే 45మంది యువకులపై దీన్ని ప్రయోగిస్తారు. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే లోతైన పరీక్షలు చేసి విడుదల చేస్తారు. ఈ వ్యాక్సిన్ తో దుష్పరిణామాలు పరిశీలిస్తారు. దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. షాట్స్ విధానంలో ఈ వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేసినట్టు తెలిపారు.
వ్యాక్సిన్ కనుక అందుబాటులోకి వస్తే ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడిన వారం అవుతాము. కానీ దీనికి కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.