Begin typing your search above and press return to search.
అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టులు
By: Tupaki Desk | 19 May 2017 9:18 AM GMTసరైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసించే వారిపై అగ్రరాజ్యం అమెరికా కొరడా ఝులిపిస్తోంది. పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల తర్వాత అంటే జనవరి 22 నుండి ఏప్రిల్ 29 వరకు 41,138మంది ఇమ్మిగ్రేషన్ అరెస్టులు చోటు చేసుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 30వేలుగా ఉంది. అంటే అరెస్టుల్లో 38శాతం పెరుగుదల నమోదైంది. కాగా, ఈ 41వేల మందిలో నేర నేపథ్యం లేని వారు 75శాతం మంది ఉన్నారని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు.
అమెరికా ఇమిగ్రేషన్ తాత్కాలిక డైరెక్టర్ థామస్ హోమన్ వలసల గురించి స్పందిస్తూ ``నేరస్తుడు కాకపోయినా ఎందుకు అరెస్టు చేస్తున్నామంటే వారు అక్రమంగా సరిహద్దు దాటి వచ్చారు కాబట్టి. అంటే చట్టాన్ని ఉల్లంఘించినట్లే. అది నేరపూరితమైన చర్యే``అని తేల్చిచెప్పారు. ట్రంప్ ఉత్తర్వుల తర్వాత ఐసీఈ ఏజెంట్లు ఎలాంటి పత్రాలు లేని ఇమ్మిగ్రెంట్లను రోజుకు 400మందిని అరెస్టు చేశారు. నేరచరిత వున్న వారిపై ప్రస్తుతం తాము దృష్టి పెట్టామని హోమన్ చెప్పారు. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 41వేల మంది అక్రమ వలస వాసులను అమెరికా ఇమ్మిగ్రేషన్ (ఐసిఇ) అధికారులు అరెస్టు చేశారు. ట్రంప్ వంద రోజుల పాలనలో చూసినట్లైతే నేర చరిత్ర లేని, పక్కా పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన 10,845మందిని అరెస్టు చేయగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య కేవలం 4,242గా ఉంది. అయితే వీరంతా ఏ జాతీయులనేది మాత్రం ఐసీఈ వెల్లడించలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/