Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్.. మన దీపావళికి అమెరికాలో సెలవు..!

By:  Tupaki Desk   |   4 Nov 2021 11:49 AM GMT
గుడ్ న్యూస్.. మన దీపావళికి అమెరికాలో సెలవు..!
X
ప్రపంచంలోని ఏ దేశంలో లెనన్నీ పండులన్నీ మనదేశం(భారత్)లోనే ఉన్నాయి. కాగా ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంది. భిన్నత్వంలో ఏకత్వంగా మెలుగుతున్న భారతీయులంతా మన సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళుతున్నారు. అలాంటి విశిష్టతను చాటే పండుగల్లో దీపావళి పండుగ కూడా ఒకటి. జాతి, కులం, మతం అనే బేధం లేకుండా ప్రతీఒక్కరూ ఈ పండుగను ఆనందంగా ఆస్వాధీస్తుంటారు.

చెడుపై మంచి సాధించిన విజయంగా 'దీపావళి' పండుగను జరుపుకోవడం ఆనాదిగా వస్తోంది. జీవితంలోని చీకటిని పారద్రోలి కొత్త వెలుగును ఆస్వాదించుకునేలా ప్రతీ కుటుంబం దీపావళి పండుగను జరుపుకుంటోంది. చిన్నారులే కాకుండా పెద్దలు సైతం టపాసులు పేల్చుతూ ఈ పండుగను జరుపుకోవడానికి ఇష్టపడుతుంటారు.

నేడు దీపావళి పండుగను పురస్కరించుకొని మనదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఆయా దేశాల్లో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక అమెరికాలోనూ మనదేశంలో మాదిరిగానే అధికారిక సెలవు దినంగా ప్రకటించేందుకు మార్గం సుమగం అయింది. ఇది ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.

తాజాగా అమెరికా చట్టసభలో దీపావళి రోజును సెలవు దినంగా ప్రకటించేందుకు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మనదేశంలో మాదిరిగానే అమెరికాలోనూ దీపావళి రోజున అధికారికంగా సెలవు లభించనుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉండటంతో ఈ బిల్లు ఈసారి ఖచ్చితంగా ఆమోదం పొందుతుందనే ధీమా వ్యక్తం అవుతోంది.

దీపావళి డే యాక్ట్ పై అమెరికా కాంగ్రెస్ మ‌హిళా నేత మ‌లోనీ మాట్లాడుతూ చీక‌టిపై విజ‌యానికి గుర్తుగా దీపావ‌ళిని జ‌రుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం దేశంలో క‌రోనా అనే చీక‌టిపై చేస్తున్న యుద్ధానికి దీపావ‌ళి గుర్తుగా మారిందని తెలిపారు. అనంతరం ఇండియ‌న్‌-అమెరిక‌న్ కాంగ్రెస్ మెన్ రాజ కృష్ణమూర్తి మాట్లాడారు. ఈ ఏడాది దీపావ‌ళి పండుగ ప్ర‌పంచ వ్యాప్తంగా వెలుగులు నింపాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.